Begin typing your search above and press return to search.
నితీశ్ ముఖ్యమంత్రి ఓకే.. మరి లాలూకేంటి?
By: Tupaki Desk | 9 Nov 2015 4:15 AM GMTబీహార్ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ కు మించి లౌకిక మహా కూటమి అపూర్వ విజయాన్ని సాధించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మహా కూటమికి 178 స్థానాలు.. ఎన్డీయే కూటమికి 58 స్థానాల్లు.. ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. 41.95 ఓట్ల శాతంతో మహా కూటమి భారీగా సీట్లను కొల్లగొట్టింది. 34.1 శాతం ఓట్లను సాధించినా.. జీర్ణించుకోలేని అపజయం ఎన్డీయేకు తప్పలేదు. ఇక.. 24 శాతం ఓట్లను సాధించిన ఇతరులు సోదిలోకి రాకుండా పోయారు.
ఇక.. మహాకూటమి ముందు నుంచి చెప్పినట్లే తమ ముఖ్యమంత్రిగా నితీశ్ ను ఎంపిక చేసుకోనుంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. బీహార్ లో నితీశ్ హవా నడుస్తుందని.. ఆయన హీరో అయితే.. తామంతా నితీశ్ చలువతో విజయం సాధిస్తామన్న భావనలో కూటమి ఉండేది. ఈ నమ్మకం వల్లనే.. నితీశ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిసైడ్ చేసి.. ప్రచారం చేశారు. అయితే.. ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. నితీశ్ నేతృత్వంలోని జేడీయూకి 71 సీట్లు వస్తే.. కూటమిలో మిత్రపక్షంగా ఉండి.. ఎన్నికల నాటికి ఎలాంటి అంచనాలు లేని లాలూ ఆర్జేడీ 80 స్థానాల్లో విజయం సాధించి.. తమ సత్తాను ప్రదర్శించింది.
సంకీర్ణ ప్రభుత్వాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీకి చెందిన వారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. అయితే.. బీహార్ ఎన్నికల్లో నితీశ్ కంటే లాలూనే అత్యధిక సీట్లు సాధించారు. ముందుగా అనుకున్న దాని ప్రకారమే తాము నడుచుకుంటామని.. మిత్ర ధర్మానికి ఎలాంటి భంగం రానివ్వమని లాలూ ఇప్పటికే స్పష్టం చేశారు. నిజానికి లాలూకు ఉండే ఇబ్బందులు లాలూకు ఉన్నాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన సర్దుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఆయన మీద అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఈ నేపథ్యంలో.. ఆయనకు ఇప్పుడు పదవి కంటే కూడా.. తన ఇద్దరు కొడుకుల రాజకీయ భవిష్యత్తు చాలా ముఖ్యం.
బీహార్ లో తమ పట్టు పోయిందన్న వేదనలో ఉన్న వారికి.. తాజా ఫలితాలు పెద్ద ఊరడింపుగా మారనున్నాయి. దీపం ఉండగానే ఇల్లును చక్కదిద్దుకోవాలన్న మాటకు తగ్గట్లుగా.. బీహార్ ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని తన కొడుకులిద్దరిని బీహార్ భవిష్యత్ నేతలుగా మార్చే అంశంపై లాలూ ఇప్పుడు దృష్టి పెట్టటం ఖాయం. అందుకే.. ఇప్పటికిప్పుడు తొందరపడే కన్నా వేచి చూసే ధోరణికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. అలా అని.. ఆయన మరీ ఉదారంగా ఉంటారని అంచనా కూడా తప్పే. ముఖ్యమంత్రి స్థానంలో నితీశ్ ముందే ప్రచారం చేయటంతో ఆ విషయాన్ని వదిలేసి.. ఉప ముఖ్యమంత్రి పదవిని లాలూ ఆశించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తన ఇద్దరి కొడుకుల్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా.. మరొకరిని కీలక మంత్రి పదవి ఇవ్వాలని కోరటం ఖాయం. నితీశ్ సైతం ఈ మాటను కాదనలేని పరిస్థితి.
బీహార్ ఎన్నికలు తన పేరు మీదనే జరిగినా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లాలూ హీరోగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో.. సంకీర్ణయంలో ఉండే సమస్యలు నితీశ్ కు ఇప్పుడు మరింత బాగా తెలిసి రావటం ఖాయం. ఇంతకాలం నితీశ్ కు మిత్రులుగా ఉండే వారి విషయంలో ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది. దీని కారణంగానే ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. కానీ.. ఇప్పుడు ఆయన లాలూతో జత కలిశారు. లాలూ లాంటి నేతతో చేతులు కలిపి.. కలిసి ప్రభుత్వాన్ని నడపటంలో ఉండే సమస్యలు ఏమిటో.. మహా కూటమి సర్కారు కొలువు తీరే వేళలోనే తెలుస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.