Begin typing your search above and press return to search.
శిక్షలోనూ లాలూది రికార్డే!
By: Tupaki Desk | 24 March 2018 10:16 AM GMTదేశంలోని సమకాలీన రాజకీయ నేతల్లో సీనియర్ రాజకీయవేత్తగానే కాకుండా బీహార్ కు పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏది చేసినా రికార్డు కిందకే వస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా లాలూ రికార్డు సృష్టించారనే చెప్పాలి. అప్పటిదాకా నష్టాల్లో ఉన్న భారతీయ రైల్వేలను రెండంటే రెండేళ్లలోనే లాభాల బాట పట్టించిన లాలూ చాతుర్యం... దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఐఐఎంలతో పాటు అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో పాఠ్యాంశం అయిపోయింది. అంతేనా... భారతీయ రైల్వేలను లాభాల బాట పట్టించిన మీ అనుభవాన్ని మా విద్యార్థులకు నేర్పించండి అంటూ లాలూకు విశ్వవ్యాప్తంగా ఉన్న పలు విద్యాలయాల నుంచి ఆహ్వానాలు కూడా అందాయి. ఇక గూండారాజ్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన బీహార్ కు పలు మార్లు సీఎంగా వ్యవహరించిన లాలూ... పశువులకు దాణా సరఫరా కేసులో అడ్డంగా బుక్కైపోయారు.
దాణా స్కాంలో ఇరుక్కున్న లాలూ ఉన్నపళంగా జైలులోకి వెళ్లాల్సి రాగా... అప్పటిదాకా సీఎంగా ఉన్న లాలూ దేశంలో ఏ ఒక్క నేత వ్యవహరించని విధంగా తన సతీమని రబ్రీదేవిని సీఎం పీఠం ఎక్కించారు. భార్యను కుర్చీలో కూర్చోబెట్టి... జైలు నుంచే పాలనను సాగించిన నేతగా లాలూ అరుదైన ఘనతను సాధించారు. వందల కోట్ల విలువ కలిగిన దాణా నిధులు పక్కదారి పట్టగా... లాలూ ఖాతా కింద తేలింది కేవలం రూ.3.18 కోట్లు మాత్రమే. ఈ మాత్రానికే లాలూపై ఏకంగా నాలుగు కేసులు నమోదు కాగా... ఆ కేసులన్నింటిలోనూ లాలూను దోషిగా తేలుస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికే మూడు కేసుల్లో లాలూ దోషిగా తేలిన నేపథ్యంలో ఆయన ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నారు.
ఇక నాలుగో కేసులోనూ లాలూను దోషిగా తేలుస్తూ మొన్న రాంచీ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తాజాగా నాలుగో కేసులో శిక్షను ఖరారు చేస్తూ కోర్టు నేటి ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగో కేసులో ఏకంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 లక్షల జరిమానాను విధించింది. అంతకుముందే మూడు కేసుల్లో దోషిగా తేలిన లాలూ... నాలుగో కేసులో పడిన శిక్షతో కలిపి మొత్తంగా 20.5 ఏళ్ల పాటు జైలు జీవితం గడపాల్సి ఉంది. ఈ మేర సుదీర్ఘ జైలు శిక్ష పడిన రాజకీయ నేత దేశంలో దాదాపుగా లేరనే చెప్పాలి. బీహార్ సీఎంగానే కాకుండా కేంద్ర రైల్వే మంత్రిగా తనదైన శైలి పాలనను సాగించి రికార్డు పుటల్లోకి ఎక్కిన లాలూ... చివరకు అత్యధిక జైలు శిక్ష పడిన రాజకీయ నేతగానూ తాజాగా రికార్డు సృష్టించారని చెప్పాలి.