Begin typing your search above and press return to search.
ఆ డిప్యూటీ సీఎం టెన్త్ క్లాసయినా చదవలేదు
By: Tupaki Desk | 20 Nov 2015 10:58 AM GMTఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజశ్వి ప్రతాప్ యాదవ్ దేశంలో పలు రికార్డులు సొంతం చేసుకోబోతున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిన నితీశ్ కుమార్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తేజస్వికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనుండడంతో పలు ప్రత్యేకతలు సొంతం చేసుకోబోతున్నారు. ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొలుత ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయగా , ఆ వెంటనే తేజశ్వి ప్రమాణం చేశారు. 26 ఏళ్ల తేజశ్వి తొలిసారి ఎన్నికల బరిలోదిగి గెలిచారు. విశేషమేమిటంటే ఆయన 9వ తరగతి మాత్రమే చదువుకున్నారు. దీంతో అతి చిన్న వయసులోనే డిప్యూటీ సీఎం అవుతున్న వ్యక్తిగా, కేవలం తొమ్మిదో తరగతి చదువుకున్న డిప్యూటీ సీఎంగా ఆయన్ను పేర్కొంటున్నారు. మరోవైపు తేజశ్వి క్రికెటర్ కూడా కావడంతో అదికూడా ప్రత్యేకతే కానుంది. ఇంతవరకు ఏ క్రికెటర్ కూడా డిప్యూటీ సీఎం స్థాయికి చేరలేదు.
ఇటీవల ఎన్నికల్లో లాలూసారథ్యంలోని ఆర్జేడీ మహాకూటమి తరఫున పోటీ చేయగా మిగతా మిత్ర పక్షాల కంటే అత్యధికంగా 80 స్థానాల్లో గెలిచింది. తేజశ్వి సోదరుడు 28 ఏళ్ల తేజ్ ప్రతాప్ కు సైతం మంత్రి పదవి దక్కింది. తేజ్ ప్రతాప్ సైతం ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. కాగా తేజశ్వి మాజీ క్రికెటర్ . ఐపిఎల్ తరఫున కూడా ఆడాడు. ఐపిఎల్‌లో ఢిల్లి డేర్ డెవిల్స్ తరఫున ఆయన ఆడాడు .ఆయన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నదాని ప్రకారం ఒక కోటి రూపాయాలు ఆస్తి ఉండగా సొంతంగా కారు కూడా లేదని పేర్కొన్నారు. మొత్తానికి మోడీపై పోరులో పైచేయి సాధించిన నితీశ్ ఈ ప్రయత్నంలో తనకు అండగా ఉన్న లాలూ పట్ల కృతజ్ఙతతో ఆయన ఇద్దరు కుమారులకు మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా ఒకరిని ఏకంగా ఉప ముఖ్యమంత్రి చేస్తుండడం విశేషం. ఇంకో విషయమేంటంటే తేజస్విని ఎక్కడ పోటీచేయించాలని... ఎలా గెలిపించాలన్న విషయాలన్నీ నితీశే తొలి నుంచి చూసుకున్నారు. మొదటి నుంచి నితీశ్ ఎందుకో తేజస్విపై బాగా ఇంట్రస్ట్ చూపించారు. ఆ కారణంగానే ఆయన 26 ఏళ్ల కుర్రాడైనప్పటికీ, రాజకీయ అనుభవం లేనప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారని చెబుతున్నారు.