Begin typing your search above and press return to search.
మోడీపై మాజీ సీఎం పంచ్ అదిరిపోలేదా
By: Tupaki Desk | 3 Sep 2016 5:14 PM GMTఆసక్తికరమైన పంచ్ లతో ప్రకటనలు చేసే రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరో మారు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రిలయన్స్ జియో డాటా ప్యాకేజీలను - దేశంలో పరిస్థితులను పోల్చిచూపడమే కాదు ప్రధాని నరేంద్రమోడీపై తనదైన శైలిలో విమర్శలు కూడా చేశారు. రిలయెన్స్ జియో ప్రకటనలలో మోడీ కనిపించడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో భాగంగా లాలూ..పేద ప్రజలు తినేది డేటా కాదు ఆటా (గోధుమ)అని ట్వీట్ చేశారు. అయితే నిత్యావసరం కానీ డేటా చాలా చౌక అయిపోగా పేదల ఆకలి తీర్చే ఆటా ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతోందని విమర్శించారు.
అచ్చేదిన్ ఆయేగా అంటూ మోడీ ఇచ్చిన హామీకి ఫలితం ఇదేనా అంటూ అని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. తనకు తాను మార్పు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకొన్న మోడీ మార్పునకు ఇచ్చే నిర్వచనమిదేనా అంటూ ప్రశ్నించారు. రిలయన్స్ జియోపై ఇప్పటివరకు రాజకీయ నాయకులు స్పందించకపోగా అలాకామెంట్ చేసిన మొదటి వ్యక్తిగా లాలూ ప్రసాద్ యాదవ్ నిలిచారు. తద్వారా మోడీ ప్రచారాన్ని - జియో హవాను టార్గెట్ చేసి ప్రత్యేకతను చాటుకున్నారు.