Begin typing your search above and press return to search.
లాలూ మార్కు రాజకీయం షూరూ
By: Tupaki Desk | 28 Nov 2015 7:52 AM GMTబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేత నితీష్ కుమార్ తో జట్టుకట్టి విజయతీరానికి చేరిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూటమి పాలనలో భాగస్వామ్యం పంచుకున్న సంగతి తెలిసిందే. నితీశ్ మంత్రి వర్గంలో ఇద్దరు కొడుకులు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో లాలూ ప్రసాద్ తన దూకుడు పెంచారు. ఈ క్రమంలో స్వయంగా రంగంలోకి దిగిన ఆర్జేడీ అధినేత కొడుకులను తీర్చిదిద్దుతున్నారు.
లాలు పెద్ద కుమారుడు ఆరోగ్యశాఖతో పాటు మరో రెండు శాఖలను కూడా నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు మరో రెండు శాఖలను నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తండ్రి హోదాలో పాలన మెలుకువలు నేర్పించే పనిలో లాలు బిజీ అయిపోయారు. మంత్రులుగా వారిద్దరికీ కేటాయించిన బంగ్లాల్లో కాకుండా లాలూ ప్రస్తుతం ఉంటున్న నివాసంలో ఆయన ఇద్దరు తనయులు ఉంటున్నారు. తండ్రి వద్ద ఎప్పటి కప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారు. లాలూ కూడా ఇద్దరు కుమారులను పరిపాలనలో తీర్చిదిద్దేందుకు తగినంత సమయాన్ని కేటాయిస్తుండటం గమనార్హం.
ఇదే క్రమంలో అధికారులను సైతం తనదైన శైలిలో మార్పులు చేయిస్తున్నారు. గతంలో తన హయాంలో నమ్మకస్తులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను ఏరికోరి మరీ ప్రస్తుతం ఆహ్వానించారు. తన తనయులిద్దరికీ తోడ్పాటునందించాలని వారిని కోరారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరుణ్ కుమార్ ని బదిలీ చేయించి, తమకు అనుకూలంగా ఉండే సుధీర్ కుమార్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. 1982 బ్యాచ్‌కి చెందిన సుధీర్ కుమార్ లాలూ ప్రసాద్ కు ఎంతో సన్నిహితుడు. అదే విధంగా పెద్ద కొడుకు విషయంలో కూడా లాలూ ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న తేజ్ ప్రతాప్ కు పాలనలో ఇబ్బందులు తలెత్తకుండా ఆర్.కె మహాజన్ ను ఆ శాఖకు బదిలీ చేయించుకున్నారు.ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహాజన్ ఇక నుంచి లాలూ పెద్దకొడుకుకి అండగా ఉండనున్నారు. లాలూ ప్రసాద్ యూపీఏ 1 సర్కార్ ఉన్నపుడు రైల్వే శాఖను నిర్వహించే సందర్భంలో మహాజన్ రైల్వే శాఖలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలందించారు.
మొత్తంగా మహాకూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన లాలూ ఇపుడు పరిపాలనలోనూ షాడో సీఎం పాత్రను కుమారులకు న్యాయం చేసేందుకు పూర్తి సమయాన్ని కేటాయించడం ఆసక్తికరం.