Begin typing your search above and press return to search.
న్యాయమూర్తి ఎదుటే లాలూ హెచ్చరికలు!
By: Tupaki Desk | 12 Jan 2018 6:52 AM GMTసరదాగానా కావొచ్చు.. కానీ లాలూ బెదిరింపులు చూసి.. న్యాయమూర్తి నవ్వుకోవడం మాత్రమే కాదు. కోర్టు రూం మొత్తం కూడా నవ్వులు విరిశాయి. నన్ను గనుక ఓపెన్ జైలులో పెడితే.. సెక్యూరిటీ ఏర్పాట్లు చూడడానికి జార్ఖండ్ లో ఉండే మొత్తం 20 వేల మంది పోలీసు ఫోర్సును బయట పెట్టినా కూడా సరిపోదంటూ.. లాలూ న్యాయమూర్తితో రెచ్చిపోయి చెప్పడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. లాలూ ప్రసాద్ యాదవ్ కు దాణా కుంభకోణంలోని ఒక కేసుకు సంబంధించి... మూడున్నరేళ్ల జైలుశిక్షను కొన్ని రోజుల కిందట విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే
లాలూ ప్రసాద్ యాదవ్ అదే కుంభకోణానికి సంబంధించి.. దమ్ కా ట్రెజరీ కేసులో కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ కేసు విచారణకు మళ్లీ అదే న్యాయమూర్తి ఎదుటకు లాలూ రావడం జరిగింది. ఈ కేసులో తనకు కేవలం 2.5 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే ఇవ్వాలంటూ లాలూనే న్యాయమూర్తికి సూచించారు. ఆ సంగతి పక్కన పెడితే.. న్యాయమూర్తి శివ్ పాల్ సింగ్ – లాలూప్రసాద్ ల మధ్య ఆసక్తి కరమైన సంభాషణ జరిగింది.
లాలూను చూడగానే న్యాయమూర్తి సింగ్.. జైలులో మీకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగారు. అందుకు సమాధానంగా.. తనకోసం వస్తున్న పార్టీ నాయకులు - ఇతర విజిటర్స్ ను కలవనివ్వకుండా జైలు అధికారులు అడ్డు పడుతున్నారంటూ లాలూ ప్రసాద్ కంప్లయింట్ చేశారు. ఆ విషయంలో తాము చేయగలిగేది ఏమీ ఉండదని.. . జైలు మాన్యువల్ ప్రకారమే అధికారులు వ్యవహరిస్తారని.. న్యాయమూర్తి సింగ్ సెలవిచ్చారు. ‘అందుకే నేను మిమ్మల్ని ఓపెన్ జైలుకు తీసుకువెళ్లాల్సిందిగా కూడా సిఫారసు చేశాను’ అంటూ న్యాయమూర్తి ఛలోక్తి విసిరారు. అందుకు 69 ఏళ్ల లాలూ ఏమాత్రం తడుముకోకుండా.. ‘నన్ను ఓపెన్ జైలులో ఉంచి.. పార్టీ కార్యకర్తలను కలవనివ్వకుండా ఆపారంటే గనుక.. అక్కడొక విధ్వంసం మారణకాండ జరిగిపోతుంది. జార్ఖండ్ లోని మొత్తం 20 వేల మంది పోలీసుల్ని కూడా అక్కడ సెక్యూరిటీకి ఏర్పాటుచేసినా కంట్రోల్ చేయలేరు.. ’ అంటూ లాలూ సరదాగానే ప్రతిస్పందించారు. దీంతో కోర్టు రూంలో నవ్వులు విరిశాయి.
ఛలోక్తులకు సరదా సంభాషణలకు రిటార్టులకు పెట్టింది పేరు అయిన లాలూ ప్రసాద్ చివరికి తనకు జైలు శిక్ష పడినప్పటికీ.. సీరియస్ గా తీసుకోకుండా.. అదే హాస్యస్ఫోరక ధోరణిలో ఉన్నారని అంతా అనుకుంటున్నారు.