Begin typing your search above and press return to search.
లాలూ ఆరోగ్యం విషమం... చికిత్స చేసినా ఫలితం లేదంట
By: Tupaki Desk | 12 Dec 2020 5:18 PM GMTరాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా మారింది. చికిత్స చేసినా పెద్దగా ఫలితం లేదని, ఏ క్షణాన్నైనా లాలూ ఆరోగ్యం మరింత విషమించే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. బీహార్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లాలూ... తాను యాక్టివ్ గా ఉన్న సమయంలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. అయితే తాను అధికారంలో ఉండగా చోటుచేసుకున్న దాణా కుంభకోణంలో దోషిగా తేలి జైలుకెళ్లిన తర్వాత ఆయన హవా అంతకంతకూ తగ్గిపోయింది.
జైల్లో ఉన్నా కూడా తనదైన శైలి రాజకీయాలు సాగించిన లాలూ... తన వారసుడిగా చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్‌ను రంగంలోకి దించారు. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా బరిలోకి దిగినా... పెద్దగా రాణించలేకపోయారు. అయితే తేజస్వీ యాదవ్ మాత్రం తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తేజస్వీ రాజకీయంగా బలంగా ఎదుగుతున్న సమయంలో లాలూ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. 20 ఏళ్ల క్రితం షుగర్ వ్యాధికి గురైన లాలూ క్రమంగా చికిత్స తీసుకుంటున్నా... షుగర్ వ్యాధి ప్రభావంతో ఆయన కిడ్నీలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కిడ్నీల పనితీరు మరింతగా విషమించిందట. లాలూ కిడ్నీలు 25 శాతం మేర మాత్రమే పనిచేస్తున్నాయట.
లాలూ ఆరోగ్యం గురించి ఆయన వైద్యుడు డాక్టర్ ప్రసాద్ ఏమన్నారన్నారంటే... *లాలూ కిడ్నీలు 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ఏ క్షణమైనా ఆయన ఆరోగ్యం విషమించొచ్చు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులకు తెలియజేశా. లాలూ కిడ్నీ పనితీరు మరింత దిగజారచ్చు. గత 20 ఏళ్లుగా లాలూ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో కిడ్నీ దెబ్బతింటూ వచ్చింది. డయాబెటిస్ కారణంగా కిడ్నీ దెబ్బతిన్నందున ఇతర వైద్యం కోసం మరోచోటికి తరలించాల్సిన అవసరం లేదు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమే. వ్యాధిని ఏ మందూ నయం చేయలేదు. రిమ్స్‌లో కాకుండా మరో చోట చికిత్స చేయించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. రిసెడెంట్ నెఫ్రాలజిస్టును సంప్రదించి చికిత్సపై నిర్ణయానికి రావాలని భావిస్తున్నాం* అని ప్రసాద్ పేర్కొన్నారు.