Begin typing your search above and press return to search.

లాలూకు నెల‌నెలా పింఛ‌న్‌..గ్రేట్ లాజిక్‌

By:  Tupaki Desk   |   12 Jan 2017 9:49 AM GMT
లాలూకు నెల‌నెలా పింఛ‌న్‌..గ్రేట్ లాజిక్‌
X
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇక ప్రతినెలా రూ.10 వేల పెన్షన్ పొందనున్నారు. మాజీ సీఎం కోటాలో ఈ మొత్తం అందుకుంటున్నారా అనేదే మీ ప్ర‌శ్న అయితే మీ గెస్ త‌ప్పు అయిన‌ట్లే. దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం పాలు చేసేలా 1970లో విధించిన‌ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఈ పించ‌న్ పొంద‌నున్నారు.

అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి - ఐర‌న్ లేడీ ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ 1970లో జయప్రకాశ్ నారాయణ్ భారీ ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమంలో పాలుపంచుకొని జైలుశిక్ష అనుభవించిన వారికి జేపీ సేనాని సమ్మాన్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ ఇవ్వాలని 2009లో బీహార్ సీఎం నితీశ్‌కుమార్ నిర్ణయించారు. 1974 మార్చి 18 నుంచి 1977 మార్చి 21 వరకు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్ (డీఐఆర్), మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆరునెలల కంటే ఎక్కువ జైలుశిక్ష అనుభవించిన వారికి ప్రతినెలా రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని, ఆరునెలల కంటే తక్కువ శిక్ష అనుభవించిన వారికి రూ.5 వేల పెన్షన్ అందించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని కారణాలుగా పెన్షన్ అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ పథకం ప‌ట్టాలెక్కింది. ఈ ప‌థ‌కం కింద పెన్షన్ పొందేందుకు లాలూ చేసుకొన్న దరఖాస్తు తుది పరిశీలనలో ఉందని, ఆమోదం పొందగానే ఆయన పెన్షన్ అందుకొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2009లో ఈ పథకం ప్రారంభించినందున అప్పటి నుంచి ఆయనకు పెన్షన్ మొత్తం లభిస్తుందని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/