Begin typing your search above and press return to search.

డెల్టాకు తోడైన లంబ్డా .. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్‌..!

By:  Tupaki Desk   |   7 July 2021 3:30 PM GMT
డెల్టాకు తోడైన లంబ్డా .. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్‌..!
X
క‌రోనా రెండో సేవ్ తొల‌గిపోతున్న త‌రుణంలో మ‌రింత జాగ్రత్త‌లు తీసుకోవాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే వివిధ దేశాల‌లో కొత్త‌గా డెల్టా వేరియంట్ల కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. యూకే లాంటి దేశాల‌లో ఉన్న వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, దీనిని C.37 గా గుర్తించిన‌ట్టు పేర్కొంది.క‌రోనా వైర‌స్ రూపాంతం చెందుతున్న త‌రుణంలో వ్యాక్సిన్ కూడా అంత‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చు అని వైద్యులు చెబుతున్నారు.

సుమారుగా రెండేండ్లుగా క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తుంది. కాలానికి అనుగుణంగా ఈ క‌రోనా వైర‌స్ రూపాంతం చెందుతున్న క్ర‌మంలో కొత్త వేరియంట్లు మ‌నుషుల‌పై విరుచుకుప‌డుతున్నాయి. భార‌త్‌లో సెకండ్ వేవ్ కార‌ణ‌మైన డెల్టా. ఇప్పుడు వివిధ దేశాల‌లో విజృంభిస్తుంది. ఇప్ప‌టికే 96 దేశాల్లో ఈ డెల్టావేరియంట్ విస్త‌రించింద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ద‌క్షిణ‌ అమెరికా, లాటిన్ అమెరికాల్లో రోజురోజుకు కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు దేశాల‌లో డెల్టా ప్ల‌స్ ఆందోళ‌న పెడుతుంటే.. మ‌రికొన్ని దేశాల‌లో లాంబ్డా వ‌ణికిస్తుంది. క‌రోనా కొత్త వేరియంట్, లాంబ్డా వైర‌స్‌ల‌తో ఆయా దేశాలు అలాడుతున్నాయి. బ్రిటన్‌లో ఉన్న కొత్త వేరియంట్ డెల్టా కంటే లామ్డా ప్ర‌మాద‌క‌రం. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల్లో 6 కేసులు న‌మోదు అవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. నాలుగు వారాల్లో బ్రిట‌న్ తో పాటు 30 దేశాల‌కు లాండ్డా వేరియంట్ వ్యాపించింది. దీంతో ఇత‌ర దేశాలు స్ట్రెయిన్‌పై ఫోక‌స్ పెట్టాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌ధాన సూచించింది.

అయితే ఈ లంబ్డా వేరియంట్ తొలిసారి పెరూ దేశంలో ఉద్బ‌వించింద‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఈ కొత్త ర‌కం వైర‌స్ ద్వారా 80శాతం ఇన్పెక్ష‌న్లు వ్యాపిస్తున్న‌ట్టు గుర్తించారు. డిసెంబ‌ర్ 2020లో శాస్త్రవేత్తలు ఈ లంబ్డా వేరియంట్‌ను కొనుగోన్నారు. ఈ కొత్త వైర‌స్ పెరూ దేశం నుంచి పొరుగున్న ఉన్న చిలీలో కూడా ప్ర‌బ‌లుతోంది. మొద‌ట ఈ వైర‌స్ అర్జెంటినాతో పాటు ద‌క్షిణ అమెరికా దేశాల‌లో ఉన్న‌ట్టు గుర్తించారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా గుర్తించిన SARS-CoV-2 వేరియంట్లు ప‌లు దేశాల‌లో ఉన్నాయి. వైరస్ భాగాలు మానవ కణాలపై దాడి చేస్తాయి. లాంబ్డా అనేక ఉత్పరివర్తనాలను కలిగి ఉందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఒక ప్ర‌ట‌క‌న‌లో పేర్కొంది. ఈ జన్యుసంబంధమైన మార్పులతో మ‌నుషుల‌పై వ్యాప్తి చెందుతుంది. ప్ర‌స్తుతం కొనుగొన్న టీకాలు మొద‌ట గుర్తించిన క‌రోనా ఆధారంగా త‌యారు చేశారు. ఇప్ప‌డు వ‌స్తున్న వేరియంట్ల‌పై ఏ మాత్రం ప్ర‌భావం చూపుతోంద‌నే సందేహం ప్ర‌పంచ వ్యాప్తంగా నెల‌కొంది.