Begin typing your search above and press return to search.
హనుమంతప్ప జీతం ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 18 Feb 2016 5:17 AM GMTతాము చేస్తున్న ప్రజాసేవకు తగిన ఫలితం పొందేందుకు రాజకీయ నేతలు పడే తపన అంతాఇంతా కాదు. ఈ మధ్యనే ఎమ్మెల్యేల జీతాల మీద లెక్కలు చెప్పుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. జీతాల పెంపు అత్యవసరమన్న వాదనను వినిపించారు. వారికి ఇప్పటికిప్పుడు జీతాలు భారీగా పెంచాల్సిన అవసరం ఉందని చెబుతూ.. నెలవారీగా ఒక్కో ఎమ్మెల్యేకు అయ్యే ఖర్చులను ఉదహరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెల్యేల జీతాల్ని ఏకంగా 200 శాతం పెంచాలంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రజాసేవ చేయటానికే ఎన్నికల బరిలోకి దిగే వారి జీతాల పెంపు అంత సీరియస్ గా మాట్లాడే రాజకీయ అధినేతలు.. తమ ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు నిత్యం సిద్ధంగా ఉంటూ.. ప్రకృతి విసిరిన సవాళ్లలో కొన్నిసార్లు.. ప్రత్యర్థులు పేల్చిన తూటాలకు మరికొన్నిసార్లు బలైపోయిన సాదాసీదా సైనికులకు ఇచ్చే జీతాలెంత? వారి ప్రాణాలకు కడుతున్న మూల్యం ఎంత? అన్న ప్రశ్నలు వేసుకున్నప్పుడు దిమ్మ తిరిగిపోయే చేదునిజం ఒకటి బయటకు వస్తుంది.
సైన్యంలో సాదాసీదాగా పని చేసే ఒక లాన్స్ నాయక్ జీతం ఎంతో తెలుసా? కేవలం రూ.6,100 మాత్రమేనట. ప్రతికూల వాతావరణంలో పని చేస్తూ.. ప్రాణాలు అర్పించేందుకు ప్రతి క్షణం సిద్ధంగా ఉండే లాన్స్ నాయక్ లు లాంటి వాళ్లకు ఇంత తక్కువ జీతాలేంటి? ప్రజాసేవలో తమ జీవితాల్ని అంకితం చేస్తామనే రాజకీయనాయకులకు లక్షల రూపాయిల జీతాలుఇవ్వటం.. దాని కోసం ముఖ్యమంత్రి స్థాయి నేతలు సిఫార్సులు చేయటం. నేతల జీతాల గురించి మాట్లాడే అధినేతలు.. లాన్స్ నాయక్ ల జీతాల గురించి ఎందుకు ప్రస్తావించరు..?