Begin typing your search above and press return to search.

కరోనాపై లాన్సెట్ తీవ్ర హెచ్చరికలు .. ఈ ధోరణి మంచిదికాదు !

By:  Tupaki Desk   |   27 Sep 2020 1:30 AM GMT
కరోనాపై లాన్సెట్  తీవ్ర హెచ్చరికలు .. ఈ ధోరణి మంచిదికాదు !
X
ఇండియాలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుసరిస్తోన్న విధానాలను విమర్శిస్తూ లాన్సెట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఏమీ కాదులే అన్న ధోరణితో వ్యవహరిస్తుండడం మంచిది కాదు అని హెచ్చరించింది. ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది. శాస్త్రీయ ఆధారాలనుంచి తప్పుకోవడంతోపాటు రాజకీయంగా ప్రేరేపితమైన ధోరణిగా వ్యాఖ్యనించడం గమనార్హం.

కరోనా విజృంభణ పట్ల భారత సర్కారు చాలా పాజిటివ్ ధోరణితో ఉందని , విపరీతమవుతోన్న కరోనా సంక్షోభం మధ్య వాస్తవాలను దాచవద్దని తెలిపింది. అసలు నిజాలు చెప్పకపోతే ప్రజలకు ప్రమాదమని హెచ్చరించింది. కరోనాను కప్పిపెడుతూ ఆశావాదాన్ని ప్రోత్సహించే విధంగా చేస్తోన్న ఒత్తిడి కారణంగా భారత్‌ లో శాస్త్రీయ సంస్థలు కూడా ఆ దిశగా ప్రభావితమయ్యాయని తెలిపింది. మహమ్మారి ప్రారంభం తగిన సాక్ష్యాలు లేనప్పటికీ యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ న్వాడకంపై ఐసీఎంఆర్ పాత్రను ప్రశ్నించింది. అలాగే , భారత్‌ నుంచి కరోనాకు కోవాక్సిన్ టీకాను ఈ ఏడాది ఆగస్టు 15లోగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కొన్ని నెలల క్రితం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చేసిన ప్రకటనను కూడా లాన్సెట్‌ తప్పుబట్టింది.

అంతేకాదు, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు భారత్‌లో ఉందని ప్రభుత్వం వాదించడాన్ని కూడా తప్పుబడుతూ.. భారత్ చెబుతోన్న ఈ సంఖ్యలు పోల్చదగినవా.. అని తెలుసుకోవడం కష్టంగా ఉందని చెప్పింది. మహమ్మారిని నిలువరించే సామర్థ్యం భారతదేశానికి ఉందనీ, కానీ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలిపింది. ఇదే సందర్భంలో కరోనా నిర్వహణకు సంబంధించి కొన్ని అంశాలపై ప్రభుత్వం స్పందించిన తీరును ప్రశంసించింది.