Begin typing your search above and press return to search.
దివాలా ఎఫెక్ట్:రూ.2కే ల్యాంకో ఇన్ ఫ్రా టెక్ షేర్
By: Tupaki Desk | 19 Jun 2017 7:33 AM GMTఇవాల్టి రోజున రూ.2కు సరైన చాక్లెట్ కూడా రాని పరిస్థితి. అలాంటిది ఒక షేరు చాక్లెట్ రేటుకు దిగజారిపోవటం మామూలు విషయం కాదు. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని ఒక ప్రముఖ కంపెనీ షేరు ఈ రోజు దారుణంగా పడిపోయింది. చివరకు ఒక్కో షేరు రూ.2 కంటే తక్కువగా (రూ.1.90) పడిపోయిన వైనం మార్కెట్ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తిరంగా మారింది. ఇంతకీ ఆ షేర్ ఏమిటి? ఆ కంపెనీ ఏమిటి? అన్నది చూస్తే..
ల్యాంకో ఇన్ ఫ్రా టెక్ లిమిటెడ్ షేర్ దారుణంగా పడిపోయింది. భారీగా రుణం తీసుకొని.. తిరిగి చెల్లించకుండా ఉండటమే కాదు.. డిఫాల్టర్ గా నిలిచిన నేపథ్యంలో.. సంస్థకు ఇచ్చిన భారీ రుణాన్ని రికవరీ చేసుకునేందుకు దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఆర్ బీఐ ఆదేశాలు జారీ చేసింది.
దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో విపరీతంగా వచ్చాయి. ఈ వార్తల ప్రభావం ఈ రోజు మార్కెట్ ట్రేడింగ్ మొదలైన వెంటనే పడింది. మార్కెట్ ఆరంభంలోనే 8.5 శాతం నష్టపోయిన ఈ కంపెనీ షేరు.. అనంతరం మరింతగా పడి 17.02శాతానికి దిగజారింది.
ఆపై ఇంకాస్తా పడిపోయి అత్యల్పంగా ఒక రూపాయికి ట్రేడ్ అవుతూ ఆల్ టైం కనిష్ఠాన్ని నమోదు చేయటం గమనార్హం. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 12 నెలల్లో స్టాక్ యాభై శాతం కోల్పోయింది. కంపెనీకి ఉన్న భారీ రుణాన్ని రికవరీ చేసేందుకు ఆర్ బీఐ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో షేర్ భారీగా పతనమైంది. ప్రస్తుతం (ఉదయం 11 గంటల సమయానికి ఒక్కో షేరు రూ.1.90లకు పడింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/