Begin typing your search above and press return to search.

టీడీపీకి అమ‌రావ‌తిలో భూమి ఇచ్చేశారు!

By:  Tupaki Desk   |   23 Jun 2017 6:22 AM GMT
టీడీపీకి అమ‌రావ‌తిలో భూమి ఇచ్చేశారు!
X
వ‌డ్డించేవాడు మ‌నోడైతే... బంతిలో ఎక్క‌డ కూర్చున్నా ఇబ్బందేమీ లేద‌ట‌. ఈ సామెత పాత‌దే అయినా... ఇదే మాటను నిజం చేస్తూ ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో కారు చౌక‌గా భూమిని ద‌క్కించేసుకుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అమ‌రావ‌తి ప‌రిధిలో టీడీపీ కార్యాల‌య భ‌వ‌న నిర్మాణానికి గానూ 3.65 ఎక‌రాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిన్న అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి నిన్న అమ‌రావ‌తి ప‌రిధిలోని గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం ఆత్మ‌కూరు గ్రామంలోని ఈ భూమిని ఆ పార్టీకి భూమిని కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసేశారు.

రాజ‌కీయ పార్టీల కార్యాల‌యాల‌కు ప్ర‌భుత్వ భూముల‌ను నామ‌మాత్ర‌పు ధ‌ర‌కు కేటాయించ‌డం కొత్తేమీ కాకున్నా... రాష్ట్రంలో టీడీపీతో పాటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ, రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ - టీడీపీ మిత్ర‌ప‌క్షం బీజేపీ, క‌మ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐ... త‌దిత‌ర పార్టీలు ఉన్నా వాటి ప్ర‌స్తావ‌న‌ను వ‌దిలేసిన చంద్ర‌బాబు స‌ర్కారు.. ఒక్క టీడీపీ కార్యాల‌య భ‌వ‌నానికి మాత్ర‌మే స్థ‌లాన్ని కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. భూమి కేటాయింపు బాగానే ఉన్నా... స‌ద‌రు భూమిని టీడీపీకి ఏ ప్రాతిప‌దిక‌న బ‌ద‌లాయించార‌న్న విష‌యం చూస్తే షాక్ తినాల్సిందే.

రాజ‌ధాని ప్రాంతంలో అత్యంత విలువైన స‌ద‌రు భూమిని 99 ఏళ్ల లీజుకు క‌ట్ట‌బెట్టిన ప్ర‌భుత్వం... ఈ లీజు కాలంలో ఏడాదికి ఒక్కో ఎక‌రానికి కేవ‌లం రూ.1,000 మాత్ర‌మే వ‌సూలు చేస్తామ‌ని పేర్కొంది. అంటే దాదాపు వందేళ్ల పాటు ఆ భూమిని టీడీపీ అతి త‌క్కువ ధ‌ర‌కు ఆ భూమిని వాడుకోనుంద‌న్న మాట‌. ఇదిలా ఉంటే... ఈ భూమిలో మూడేళ్లలోగా పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించాల‌ని ఆ ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం ఓ ష‌ర‌తు విధించింది. అంటే రానున్న మూడేళ్ల‌లోగానే ఆ భూమిలో టీడీపీ పార్టీ కార్యాల‌యం నిర్మాణం అవుతుంద‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/