Begin typing your search above and press return to search.
విశాఖకు రెక్కలు...సామాన్యుడికి చుక్కలు...?
By: Tupaki Desk | 5 March 2022 2:30 AM GMTవిశాఖ అంటే కూలెస్ట్ సిటీ అని చెబుతారు. సిటీ ఆఫ్ డెస్టినీ అని మరో పేరు. ఇక్కడకు ఎవరైనా జీవితంలో ఒకసారి రావాలని అనుకుంటారు. అదే టైమ్ లో వీలుంటే ఇక్కడ నివాసం కూడా ఏర్పరచుకోవాలని భావిస్తారు. అలాంటి విశాఖ ఇపుడు చాలా ఖరీదుగా మారిపోయింది. విశాఖలో భూములకు రెక్కలు వచ్చెశాయి. రేట్లు చుక్కలను దాటేశాయి.
ఇంతకాలం ప్రైవేట్ వ్యక్తులే విశాఖ మార్కెట్ కి హైప్ చేశారు అనుకుంటే దాన్ని సాకుగా తీసుకుని ప్రభుత్వం కూడా ఇంతకు ఇంత ధరలు పెంచేసింది. అసలే విశాఖలో భూములకు గిరాకీ బాగా పెరిగిపోతూంటే ప్రభుత్వం కూడా భూముల విలువను అమాంతం పెంచేసింది.
ఏకంగా పది శాతం నుంచి యాభై శాతంగా ఈ రేట్లు పెంచేసి సామాన్యుడికి అందకుండా చేసి పారేసింది. విశఖ జిల్లావ్యాప్తంగా భూముల విలువల పెంపునకు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తిచేసింది. ఇందుకు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదముద్ర కూడా వేసింది. తక్కువగా 10 శాతం, అత్యధికంగా 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో విశాఖలో ప్రధాన ప్రాంతాల్లో గజం ధర అధికారికంగానే లక్ష రూపాయలు పలుకుతోంది. ఇక బయట దీనికి మించి ధర ఉంటుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు విశాఖలో వంద గజాల స్థలం కొనాలీ అంటే కోటి రూపాయలు పట్టుకోవాల్సిందే.
పోనీ ఈ రేట్ల పెంపు సిటీకే పరిమితమా అనుకుంటే గ్రామాలలో సైతం ధరలు అలాగే పెంచేసి భూముల విలువ బాగా పెరిగింది అంటోంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దాంతో పల్లెల్లో సైతం గజం పాతిక వేలకు తక్కువగా పకలడంలేదు. మరి పేదవాడు కానీ మధ్య తరగతి కానీ ఇల్లు ఎలా కట్టుకుంటాడు అన్న ఆలోచన పాలకులకు ఉందా అన్న డౌట్ అయితే వస్తోంది.
గత రెండేళ్ళుగా కరోనా కారణంగా భూముల విలువను పెంచలేదని మొత్తానికి మొత్తం బాదేశారు. దీనికి తోడు విశాఖ రాజధాని అవుతుందని, మెగా సిటీ అని చెప్పి మరీ భూముల రేట్లు ఆకాశానికి చేర్చేశారు. ఇలా కేవలం విశాఖకే కాదు, విజయనగరం శ్రీకాకుళం దాకా భూముల విలువను పెంచుకుంటూ పోయారు.
ఉత్తరాంధ్రా అంటే వెనకబడిన ప్రాంతం అంటారు.మరి భూముల ధరలు చూస్తే మహా నగరాలతో పోటీ పడేలా ఉందని సగటు జనాలు అంటున్నారు. ఇదంతా కేవలం బడా బాబులకు రియల్ దందాలకు మేలు చేసేది తప్ప సామాన్యులకు కాదని విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం భూముల విలువ పెంచితే ఖజానా నిండుతుంది అని భావిస్తోంది. అయితే పేదలకు ఇళ్ళు కట్టిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగులకు, వేతన జీవులకు కూడా అందుబాటులో భూముల ధరలను ఎందుకు ఉంచడంలేదు అని విపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నాయి.
కేవలం గత పదేళ్ళ నుంచే విశాఖ లాంటి చోట్ల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మరీ ముఖ్యంగా విభజన తరువాత విశాఖ లో స్థలం అంటే బంగారం కంటే మిన్న అన్న భావన కల్పించారు. ఇపుడు అది కూడా దాటి జగన్ సర్కార్ వచ్చాక రాజధాని హైదరాబాద్ తో సరిసాటి అని చెబుతూ లేని మార్కెట్ క్రియేట్ చేశారని అంటున్నారు. మొత్తానికి విశాఖకు రాజధాని రాదు, కానీ సామాన్యుడికి కట్టుకునేందుకు ఇంటి జాగా అయితే లేదు అన్నది కఠిన వాస్తవం.