Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ టైం లేడీ ఎమ్మెల్యే.. ఇంత ప‌నిచేశారా?

By:  Tupaki Desk   |   23 Oct 2021 2:30 PM GMT
ఫ‌స్ట్ టైం  లేడీ ఎమ్మెల్యే.. ఇంత ప‌నిచేశారా?
X
ఆమె ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యే. పైగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు. చాలా క‌ష్ట‌ప‌డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇటీవ‌ల రాష్ట్రంలో క‌రోనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు సేవ చేశారంటూ.. జాతీయ‌స్థాయిలో అవార్డు కూడా అందుకున్నారు. అయితే.. ఇప్పుడు ఒక్క‌సారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వైసీపీకి చెందిన నాయ‌కురాలు.. అనంత‌పురం జిల్లా శింగనమల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి. రాజ‌కీయంగా దూకుడుగా ఉండే.. ఆమెపై ఇప్పుడు భూ ఆక్రమణ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. శింగనమల నియోజకవర్గంలోని కొర్రపాడు గ్రామంలో నాగలింగారెడ్డి అనే రైతు పొలాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఆక్రమిస్తున్నారనే వీడియోతో పాటు పొలంలో రైతులపై దౌర్జన్యం చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. మ‌రి ఏం జ‌రిగింది? అంటే.. కొర్రపాడు పక్కన ఉన్న హైవేపై రైతు నాగలింగారెడ్డికి పొలం ఉంది. అయితే దాని పక్కనే ఇటీవల జొన్నల గడ్డ పద్మావతి కుటుంబీకులు ఐదు ఎకరాల పొలం తీసుకున్నట్లు సమాచారం. ఆ పొలానికి వెళ్లడానికి వేరే దారి ఉన్నప్ప టికీ ప్రధాన రహదారి నుంచి రోడ్డు వేసుకోవాలనేది వారి ఆలోచన.

ఎమ్మెల్యే పొలానికి దారి లేకపోవడంతో రైతు నాగలింగారెడ్డి పొలంపై కన్నేశారు. ఆ పొలం నుంచి దారి వేసుకోవడానికి రైతు వేసిన పచ్చటి వరి పైరును ట్రాక్టర్‎తో తొక్కించారు. దీంతో తమ పొలాన్ని ట్రాక్టర్‎తో తొక్కించారంటూ రైతు నాగలింగా రెడ్డి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తమను రక్షించాలంటూ వేడుకున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎలాంటి దారి లేకున్నా తమ భూముల నుంచి రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నారంటూ రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇదివివాదంగా మారింది.

అయితే.. వాస్త‌వానికి ఎమ్మెల్యేపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డం.. ఇప్పుడు ఏకంగా.. ఒక రైతు భూమిని ఆక్ర‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు రావ‌డం నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల నంగా మారాయి. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి. అదేవిధంగా ప‌ద్మావ‌తి కూడా ఎలా స్పందిస్తార‌నేది చూడాలి. ఏదేమైనా.. అత్యంత కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకున్న ప‌ద్మావ‌తి.. క‌నుక ఈ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే.. రాజ‌కీయంగా ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.