Begin typing your search above and press return to search.
అదేంది శివప్రసాద్ అంత పని చేశావా?
By: Tupaki Desk | 27 Aug 2018 8:21 AM GMTతెలంగాణ రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్న వేళ.. సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలు భారీగా జరిగాయి. అయితే.. తెలంగాణ ఉద్యమానికి ఇచ్చినంత కవరేజ్.. మీడియాలో సానుకూలత సమైక్య ఉద్యమం మీద పెద్దగా పెట్టలేదన్న మాట ఉంది. సిత్రమైన అంశం ఏమంటే.. సమైక్యం కోసం సీరియస్ గా సాగిన ఉద్యమాల మీద పెద్దగా ఫోకస్ చేయని మీడియా.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వేసే యాషాల మీద మాత్రం రెగ్యులర్ గా కవరేజ్ ఇచ్చేవారు.
స్వతహాగా కళాకారుడైన శివప్రసాద్.. తన వేషాలతో తన నిరసనను తెలియజేసేవారు. పార్లమెంటు వద్ద రకరకాల వేషాలు వేయటం ద్వారా ప్రజల్లో పాపులర్ అయ్యారు. సమైక్య ఉద్యమం పుణ్యమా అని.. అప్పటివరకూ తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం లేని శివప్రసాద్ తర్వాతి రోజుల్లో అందరి నోళ్లల్లో నానారు. అదే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను మరోసారి ఎంపీగా చేసిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. విభజన నేపథ్యంలో ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశంపై నిరసన వ్యక్తం చేసేందుకు ఎంపీ శివప్రసాద్ పలు రకాల వేషాలు వేయటం తెలిసిందే. తన వేషాలతో అందరికి సుపరిచితులైన ఆయనపై తాజాగా వెల్లువెత్తుతున్న భూకబ్జా ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా రేణిగుంటలో కోట్లాది రూపాయిలు ఖర్చు చేసే ఓ భూమిని శివప్రసాద్ మనుషులు కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేణిగుంట మండలం కరకంబాడిలో కోట్లాది రూపాయిలు విలువ చేసే భూమిని ఎంపీ శివప్రసాద్ మనుషుల తమ చేతుల్లోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఎంపీ పేరు చెప్పి కొందరు స్థానిక నేతలు కబ్జాలు చేసినట్లుగా మరికొందరు చెబుతున్నారు. ఈ అంశంపైన ఒక ఫిర్యాదు అధికారులకు అందింది. దీనిపై అధికారులు రియాక్షన్ పై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ తనదైన నిరసలతో తరచూ మీడియాలో కనిపించే ఎంపీ శివప్రసాద్ పేరు ఇప్పుడు కబ్జాలతో లింకు కావటం సంచలనంగా మారింది. దీనిపై ఎంపీ స్పందించి.. వివరణ ఇస్తే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.