Begin typing your search above and press return to search.
అమరావతిలో సీన్ మారిపోతోంది
By: Tupaki Desk | 13 March 2016 8:18 AM GMTనవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రస్తావన వచ్చిన వెంటనే గుర్తొచ్చేది తుళ్లూరు. రాజధాని ప్రాంతంలో కీలక గ్రామం ఇది. రాజధాని నిర్మాణంలో తైళ్లూరు కేంద్రబిందువుగా నిలిచింది. రాజధాని వస్తే తమ భూములు బంగారు గనులైపోతాయని రైతులు భావించారు. ఉన్న భూమిలో సగం ప్రభుత్వానికిచ్చి, మిగిలిన భూమిని అమ్ముకున్నా జీవితంలో స్థిరపడిపోతామని కలలు గన్నారు. బంగారం పండే నేలపై మమకారం చంపుకొని చాలామంది రైతులు ప్రభుత్వం అడిగిందే తడవుగా తమ భూములను అప్పగించారు. భూములిచ్చే సమయంలో సిఆర్‌డిఏ ఇక్కడి రైతులకు ఒక వెసులుబాటు కల్పించింది. భూములు తమకు ఇచ్చినప్పటికీ, వేరెవరైనా వచ్చి ఎక్కువ ధర చెల్లిస్తామంటే వారికి అమ్ముకోవచ్చని పేర్కొంది.
రాజధానిగా అమరావతిని ప్రకటించిన వెంటనే ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగి, కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రాజధాని ప్రకటనకు ముందు ఇక్కడ ఎకరా భూమి విలువ 5 నుంచి 7 లక్షల రూపాయలు ఉంటే, రాజధానిని ప్రకటించిన తరువాత ఏకంగా కోటీ 30లక్షల రూపాయలకు పెరిగిపోయింది. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ కన్నా ఓపెన్ మార్కెట్ ధర మూడు రెట్లు అధికంగా పలికింది. అయితే, ఇక్కడి రైతులు మరింత ఎక్కువ ధర వస్తుందని ఆశపడి భూములను విక్రయించలేదు. కొద్ది నెలల ముందు వీరు భూములు విక్రయించుకుంటే కోటీశ్వరులయ్యేవారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.
రాజధాని పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కళ్ళెం వేసేందుకు సీఆర్‌డీఏ కొన్ని నిబంధనలు విధించింది. ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్టు వెంచర్లు వేయడానికి వీల్లేదనే నిబంధన ప్రధానమైంది. వెంచర్ వేయాలంటే సీఆర్‌డీఏ అనుమతి తప్పనిసరి అనే నిబంధన పెట్టింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనడానికి ముందుకు రాలేదు. అలాగే రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం ఒకింత చతికిలపడ్డట్లు కనిపిస్తోంది. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ పవిత్ర నీరు - మట్టి ఇచ్చివెళ్లారు తప్ప, నిర్మాణానికి కావాల్సిన నిధులు మాత్రం నేటికీ విదిల్చలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం 850 కోట్ల రూపాయలే ఇచ్చింది. దీంతో రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మాత్రమే చేపట్టాలని నిబంధన విధించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా వట్టిపోయి ఉంది. రాజధానికి సంబంధించిన భవనాలు నిర్మించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో 1500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెపుతున్నా, అంత మొత్తాన్ని ఈ సంవత్సరంలో ఖర్చుచేసే అవకాశం లేదు. ఇప్పటికే 200 కోట్ల రూపాయల వ్యయంతో సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం ఇంతకు మించి రాజధాని భవనాలు నిర్మించే సూచనలు కనిపించడం లేదు. రాజధాని ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజధాని పరిధిలో భూములు కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో తుళ్లూరు గ్రామంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రియల్ భూమ్‌పై ఆశలు పెట్టుకున్న వారి ఆశలన్నీ అడియాసలయ్యాయని అంటున్నారు.