Begin typing your search above and press return to search.
ఏపీలో చరిత్రాత్మక భూ సర్వే.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్
By: Tupaki Desk | 10 Dec 2020 11:05 AM GMTసాధారణంగా కోర్టుల్లోని సివిల్ కేసుల్లో చాలావరకు భూ తగాదాలకు సంబంధించినవే ఉంటాయి. సర్వే నెంబర్లలో తేడా ఉండడం....స్థలం కొలతలో తేడా ఉండడం....ఇలా రకరకాల భూతగాదాలకు చాలావరకు పకడ్బందీగా భూరికార్డులు లేకపోవడమే కారణమన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో చరిత్రాత్మక భూసర్వేకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఏపీలో నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్న రీతిలో పక్కాగా భూసర్వే చేపట్టనున్నారు. డ్రోన్ల సహాయంతో ప్రతి సెం.మీ భూమిని పక్కాగా కొలిచి భూమి, స్థలం హక్కుదారులకు క్యూఆర్ కోడ్లు కేటాయించనున్నారు. ఇంటి స్థలం, పొలం..ఇలా ప్రతి స్థిరాస్తి కొలతలు సర్వే చేసి, రికార్డుల్లో నమోదు చేయనున్నారు. తొలుత యజమానులకు దానిపై తాత్కాలిక హక్కు (టెంపరరీ టైటిల్) ఇచ్చి రెండేళ్ల పాటు గ్రామ సచివాలయంలో ఉంచబోతున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు రాకుంటే ఆ భూములపై యజమానులకు శాశ్వత హక్కులు (పర్మినెంట్ టైటిల్) ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
భూములు, స్థలాల రీసర్వే తర్వాత అన్ని రకాల రెవిన్యూ, రిజిస్ట్రేషన్ సేవలు వార్డు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తేనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయిలో భూ సర్వే జరిగిన దాఖలాలు లేవని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ కితాబిచ్చారు. తరతరాలుగా పరిష్కారం కాని భూ తగాదాలకు ఈ సర్వే చెక్ పెట్టనుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 వేల రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 21వ తేదీన తొలి విడత రీసర్వే ప్రారంభించి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశ కింద ఆగస్టు 2021న 6,500 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభించి 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయబోతున్నారు. జూలై 2022న మూడో విడత సర్వేతో ఈ కార్యక్రమం పూర్తవనుంది.
వందేళ్ల తర్వాత రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో కొన్ని వివాదాలు వచ్చే అవకాశముంది. వాటి పరిష్కారం కోసం ప్రతి మండలంలో ఒక మొబైల్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 మొబైల్ మెజిస్ట్రేట్ ట్రైబ్యునల్స్ అక్కడికక్కడే భూ సమస్యలను పరిష్కరించనున్నాయి. సమగ్ర భూ సర్వే చేసి సరిహద్దు రాళ్లు నాటించనున్నారు. భూమి హక్కుదారులకు మంజూరు చేసే కార్డులో క్యూర్ఆర్ కోడ్ ఉంటుంది. అంతేకాకుండా, భూమి, స్థలానికి సంబంధించిన హార్డ్ కాపీ కూడా ఇవ్వనున్నారు. రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్థిరాస్తుల మ్యాపులు, డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించేందుకు 14 వేల మంది సర్వేయర్లును ప్రభుత్వం గతంలోనే నియమించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులైన వీరందరికీ అత్యాధునిక సర్వేపై శిక్షణనిస్తున్నారు. 9,400 మందికి శిక్షణ పూర్తికాగా, మిగిలిన వారికి 2021 జనవరి 26 నాటికి శిక్షణ పూర్తి కానుంది.