Begin typing your search above and press return to search.

అమెరికాలో క‌ల‌క‌లం.. ట్రంప్ ల్యాప్ టాప్ చోరీ!

By:  Tupaki Desk   |   18 March 2017 6:56 AM GMT
అమెరికాలో క‌ల‌క‌లం.. ట్రంప్ ల్యాప్ టాప్ చోరీ!
X
ప్ర‌పంచానికే పెద్ద‌న్న‌గా భావిస్తున్న అగ్ర‌రాజ్యం అమెరికాకు అధ్య‌క్షుడిగా ఎన్నికైన ఆ దేశ రియ‌ల్ ఎస్టేట్ దిగ్గ‌జం డొనాల్డ్ ట్రంప్‌... త‌న వ‌స్తువుల‌ను కూడా కాపాడుకోలేని స్థితిలో ఉన్నారా? అంటే... అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. త‌న వ్యాపారాలు - అమెరికా దేశానికి చెందిన కీల‌క డాక్యుమెంట్లు - క్రైస్త‌వుల‌కు పెద్ద‌న్న‌గా భావించే పోప్ ఫ్రాన్సిస్‌ కు చెందిన ప‌లు డాక్యుమెంట్ల‌తో పాటు త‌న చేతిలో ఓట‌మి పాలైన డెమోక్ర‌టిక్ పార్టీ నేత‌ - అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్ల‌రీ క్లింట‌న్ ను ముప్పు తిప్ప‌లు పెట్టిన ప్రైవేట్ ఈ-మెయిల్స్‌ కు సంబంధించిన నివేదిక‌ల‌న్నీ ఉన్న ట్రంప్ ల్యాప్ టాప్‌ ఒక‌టి చోరీకి గురైంది. ఈ విష‌యం ప్ర‌స్తుతం అక్క‌డ క‌ల‌క‌లం రేపుతోంది. చోరీకి గురైన ల్యాప్ టాప్‌ తో పాటు దానిని అప‌హ‌రించిన వ్య‌క్తి కోసం పోలీసులు ముమ్మ‌ర గాలింపు చేప‌డుతున్నారు. ఈ గాలింపు చ‌ర్య‌ల కంటే కూడా స‌ద‌రు ల్యాప్ టాప్‌ లోని కీల‌క స‌మాచారం ఎక్క‌డ బ‌య‌ట‌కు పొక్కుతుందోన‌న్న భ‌యాందోళ‌నే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ఇక ఈ చోరీకి సంబంధించిన వివ‌రాల్లోకెళితే... రెండు రోజుల క్రితం ట్రంప్ బ్రూక్లిన్ వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న కాన్వాయ్‌ లోని సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్ వాహ‌నం నుంచి అక్క‌డి బాత్ బీచ్ ప్రాంతంలో ఈ ట్యాప్ టాప్‌ అదృశ్య‌మైంది. ట్రంప్ నిత్యం త‌న వెంటే ఉంచుకునే ఈ ల్యాప్ టాప్‌ లో త‌న రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌ కు సంబంధించిన వివ‌రాలు - ట్రంప్ ట‌వ‌ర్‌ కు చెందిన ఫ్లోర్ ప్లాన్ వివ‌రాలు - హిల్ల‌రీ క్లింట‌న్ ప్రైవేటు ఈ-మెయిల్స్‌ కు చెందిన విచార‌ణ‌ నివేదిక‌లు, అమెరికా భ‌ద్ర‌త‌కు సంబంధించిన అత్యంత ర‌హ‌స్య స‌మాచారం, పోప్ ఫ్రాన్సిన్స్‌ కు చెందిన ప‌లు కీల‌క డాక్యుమెంట్లు కూడా అందులో ఉన్నాయ‌ని తెలుస్తోంది. అయితే స‌ద‌రు ల్యాప్ టాప్‌ లోని స‌మాచారం మొత్తం ఎన్‌ క్రిప్ష‌న్‌ లో ఉంద‌ని, ఇత‌రులు దానిని తెర‌వ‌లేర‌ని అధికారులు చెబుతున్నారు.

అయినా అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య ఉండే ట్రంప్ కాన్వాయ్ లోని సీక్రెట్ స‌ర్వీస్ ఏజెంట్ వాహ‌నం నుంచి ఈ ల్యాప్ టాప్ ఎలా చోరీకి గురైంద‌న్న విష‌యం అంతుచిక్క‌డం లేదు. విష‌యం తెలిసిన వెంట‌నే రంగంలోకి దిగిన ద‌ర్యాప్తు అధికారులు... ల్యాప్ టాప్‌ తో పాటు దొంగ‌లు ఎత్తుకెళ్లిన బ్యాగ్‌ - ఇత‌ర వ‌స్తువులు కూడా ల‌భ్య‌మ‌య్యాయి. అయితే ల్యాప్ టాప్ మాత్రం దొర‌క‌లేదు. అమెరికా అధ్య‌క్షుడి కాన్వాయ్‌ లోని ల్యాప్ టాప్‌ ను కొట్టేయ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు క‌దా. ఈ త‌ర‌హా దుస్సాహ‌సం చేసిన వ్య‌క్తులు కేవ‌లం దొంగ‌లేనా? లేక దేశ భ‌ద్ర‌త‌కు సంబందించిన కీల‌క ర‌హ‌స్యాల‌ను త‌స్క‌రించేందుకు ఇత‌ర దేశాలు చేసిన య‌త్నమా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ విషయం ఒక్క అమెరికాలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌లా మారిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/