Begin typing your search above and press return to search.
చెకిన్ లగేజ్ లిస్ట్ లో ల్యాపీకి చెక్!
By: Tupaki Desk | 25 Oct 2017 5:32 AM GMTవిమాన ప్రయాణానికి సంబంధించి కొత్త తరహా నిషేధం త్వరలో తెర మీదకు రానుందా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పోర్టబుల్ మొబైల్ ఛార్జర్స్.. ఈ సిగరెట్స్ తో పాటు పలు ఎలక్ట్రానిక్ డివైజ్ లను వెంట తీసుకెళ్లటానికి విమానాశ్రయాలు ఒప్పుకోవు.
ఇప్పుడు ఆ జాబితాలోకి ల్యాప్ టాప్ లు చేరే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల న్యూ ఢిల్లీ నుంచి ఇండోర్ కు వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడి సెల్ ఫోన్ పేలిన ఉదంతంలో పెను ప్రమాదం నుంచి క్యాబిన్ క్రూ తృటిలో తప్పించారు. ఈ ఘటన అనంతరం ప్రయాణికుల భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో ప్రమాదానికి అవకాశం ఉన్న ల్యాప్ టాప్ లను వెంట తీసుకెళ్లే లగేజీలో లేకుండా చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. చెకిన్ లగేజ్ లో పర్సనల్ ఎలక్ట్రానిక్ డివైజ్ లపై బ్యాన్ విషయంలో అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతారు.
తాజాగా.. ల్యాపీలను వెంట తీసుకెళ్లే విషయంపై విమానయాన సంస్థలు ఆలోచనలో పడటమే కాదు.. నిషేధం విధిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్యాన్ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. విమాన ప్రయాణంలో వెంట ల్యాప్ టాప్ లు తీసుకెళ్లే అవకాశం లేనట్లే.