Begin typing your search above and press return to search.

యుద్ధం ప్ర‌భావం అంతంతే ! థాంక్ గాడ్

By:  Tupaki Desk   |   21 March 2022 7:33 AM GMT
యుద్ధం ప్ర‌భావం అంతంతే ! థాంక్ గాడ్
X
రూబుల్ - రూపాయి,రియాల్ - రూపాయి ఒక‌టి ర‌ష్యా క‌రెన్సీకీ మ‌న క‌రెన్సీకి మ‌ధ్య ఉన్న అనుబంధం అయితే మ‌రొక‌టి ఇరాన్ క‌రెన్సీకి మ‌న క‌రెన్సీకి మ‌ధ్య ఉన్న బంధం. యుద్ధం ఎలా ఉన్నా కూడా రూపాయి రూపేణ ఉన్న బంధం మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది అన్న‌ది మ‌న దేశం చెబుతున్న మాట.నిర్థారిస్తున్న మాట కూడా ! ఇదే మాట మ‌రోసారి వినిపించేందుకు సిద్ధం అవుతోంది భార‌త్.అమెరికా ఆంక్ష‌లు ఏవి ఉన్నా, ఎలా ఉన్నా కూడా వినిపించుకోవ‌డం లేదు.ఏక‌ప‌క్షంగా వెళ్తూనే విదేశీ వాణిజ్య సూత్రాలను మ‌రోసారి వివ‌రించే ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తోంది.దీంతో కొన్ని రోజులుగా జ‌రుగుతున్న అస‌త్య ప్ర‌చారానికి తెర ప‌డింది. ఫ‌లితంగా పెట్రో ధ‌ర‌లు ఆకాశాన్ని, తార‌ల‌ను తాక‌డం అన్న‌ది అబ‌ద్ధం అని తేలిపోయింది.

రెండు దేశాల యుద్ధం కార‌ణంగా చిగురుటాకులా వ‌ణికి పోతున్న ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు ఏ విధంగా భ‌రోసా ఇస్తున్నారో కానీ యుద్ధం త‌ద‌నంత‌ర ప‌రిణామాలు మాత్రం మ‌రీ అంత ఆందోళ‌న‌కు దారి ఇచ్చేలా లేవు. అయితే ఆర్థిక ఆంక్ష‌ల కార‌ణంగా రష్యా చితికిపోవ‌చ్చు.కానీ ర‌ష్యా ఎగుమతుల‌పై ఏ దేశానికి ఆ దేశ‌మే స్వీయ నిర్ణ‌యం తీసుకునే వెసులుబాటు ఉండ‌డంతో భార‌త్ లాంటి దేశాలు పుతిన్ తో వాణిజ్య బంధాల కొన‌సాగింపున‌కే ఇష్ట‌ప‌డుతున్నాయి.

ఇదే స‌మ‌యంలో మాన‌వ‌తా దృక్ప‌థంతో బాధిత దేశం ఉక్రెయిన్ కు సాయం అందిస్తున్నాయి.వాణిజ్య విష‌యాల్లో అమెరికా జోక్యం పెద్ద‌గా ఫ‌లితం ఇవ్వ‌డం లేదు. ఒక‌ప్పుడు ఇచ్చిన విధంగా ఆంక్ష‌లు అన్న‌వి ఇప్పుడు పెద్ద‌న్న రాజ్యం ఇచ్చినా కూడా ప‌ట్టించుకునే ద‌శ‌లో వివిధ దేశాలు కూడా లేవు. ఎందుకంటే క‌రోనా సంక్షోభం కార‌ణంగా చాలా దేశాలు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి.ఇప్పుడున్న స్థితిలో సేఫ్ మోడ్ లో బిజినెస్ చేసుకునేందుకే కొన్ని చిన్న దేశాలు ఆస‌క్తి చూపుతున్నాయి.కోలుకోలేనంత గాయాలు మోస్తున్న దేశాలు కూడా ఇదే ప‌ద్ధ‌తికి మొగ్గు చూపుతున్నాయి.ఇదే విదేశాంగ విధానం భార‌త్ కూడా పాటిస్తోంది.ఎన్న‌డూ లేని విధంగా పెట్రో దిగుమ‌తుల‌పై దృష్టి సారించి దేశీయంగా సంక్షోభం అన్న‌ది తలెత్తకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

భార‌త్ లాంటి అస్థిర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌తో కొట్టుమిట్టాడే దేశాల‌కు రష్యా - ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం ఓ విధంగా భ‌యోత్పాతానికి కార‌ణం అయింది.కొంత వంట నూనెల ధ‌ర‌ల‌పై ప్ర‌భావం ఉన్నా కూడా పెట్రో ధ‌ర‌లు వామ‌ప‌క్షాలు ప్ర‌చారం చేసిన విధంగా పెర‌గ‌లేదు.ఆ విధంగా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత బీజేపీయేత‌ర పార్టీల అంతా అనుకున్న విధంగా కాకుండా అందుకు భిన్నంగా ప‌రిణామాలున్నాయి.

పెట్రో ధ‌ర‌లు అయితే ఇప్ప‌టికిప్పుడు పెర‌గ‌వు అన్న సంకేతాలు కేంద్రం ఇస్తోంది. ర‌ష్యా నుంచి చౌక‌గా పెట్రోలు కొనుగోలు మార్గం సుగ‌మం కావ‌డంతో దిగుమ‌తుల‌ను ప్రోత్స‌హిస్తోంది.అదేవిధంగా మిగ‌తా దేశాల‌కు సంబంధించి కూడా ఇదే విధానం అవ‌లంభిస్తోంది.అంటే వినియోగ‌దారుడికి భారం కాని విధంగా రానున్న రోజులు ఉండ‌నున్నాయి అన్న‌ది సుస్ప‌ష్టం అయింది.యుద్ధ నేప‌థ్యంలో ర‌ష్యా అరాచక వాదాన్ని వ్య‌తిరేకించాల్సిన భార‌త్ మాత్రం అందుకు భిన్నంగా వ్యాపార సూత్రాల‌ను వ‌ల్లెవేస్తోంది.

తాము ఎక్క‌డ చౌక‌గా ఉన్నా పెట్రో ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామ‌ని అంటోందని ప్ర‌ధాన మీడియా చెబుతున్న మాట.మ‌రోవైపు ఇరాన్ కూడా త‌క్కువ ధ‌ర‌కే పెట్రోలు అందించేందుకు ముందుకు వ‌స్తోంది.గ‌తంలో ఇరాన్ ఎగుమ‌తుల విష‌య‌మై అగ్ర రాజ్యం ఆంక్ష‌లు ఉన్నాయి కానీ ఇప్పుడు వాటిని ఎత్తివేయ‌డంతో సంబంధిత ప్ర‌క్రియ కార‌ణంగా భార‌త్ - ఇరాన్ మ‌ధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మ‌రింత మెరుగుప‌డే అవ‌కాశం ఉంది అని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిస్తోంది.