Begin typing your search above and press return to search.

స్పుత్నిక్-వీ ట్రయల్స్ .. రెడ్డీస్ ల్యాబొరేటరీకి కేంద్రం భారీ షాక్!

By:  Tupaki Desk   |   8 Oct 2020 2:00 PM GMT
స్పుత్నిక్-వీ ట్రయల్స్ .. రెడ్డీస్ ల్యాబొరేటరీకి కేంద్రం భారీ షాక్!
X
భారత్ ‌లో కరోనా వైరస్ వ్యాక్సిన్ సరఫరా కోసం డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ తో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌ మెంట్ ఫండ్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ ప్రయోగాలు దేశంలో పెద్ద ఎత్తున్న నిర్వహించాలని రెడ్డీస్ ల్యాబొరేటరీ అనుకుంది. అయితే, ఈ ప్రయత్నాలకు ఆదిలోనే అంతరాయం ఏర్పడింది. భారీ ప్రయోగాలకు కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ మండలి మాత్రం అనుమతి ఇవ్వలేదు. రెడ్డీస్ ల్యాబొరేటరీ ప్రతిపాదనలను తోసిపుచ్చిన సీడీఎస్‌ సీ ఓ.. మొదట స్వల్ప పరిమాణంలో వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించాలని తెలిపింది. స్పుత్నిక్-వీ టీకా క్లినికల్ ట్రయల్స్ విదేశాల్లో స్వల్పస్థాయిలోనే జరిగాయని, ఇందులో భారతీయులు పాల్గొన్నట్టు ఎటువంటి సమాచారం లేదని , పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యా ప్రణాళికకు భారత్ చర్య ఎదురుదెబ్బే.

అదే సమయంలో వ్యాక్సిన్ ఆమోదం కోసం చేసే ప్రయత్నాలను వెనక్కి నెట్టింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) పది కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికి డాక్టర్ రెడ్డీస్‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఔషధ నియంత్రణ మండలి నిబంధనలకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే.. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో దీనిని అందుబాటులోకి తేవాలని భావించారు.రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ పది కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికి డాక్టర్ రెడ్డీస్‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఔషధ నియంత్రణ మండలి నిబంధనలకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే.. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో దీనిని అందుబాటులోకి తేవాలని భావించారు. గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్‌ అవసరమైన పరీక్షలన్నీ పూర్తి చేసుకుందని, క్లినికల్ ట్రయల్స్‌లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయని రష్యా ప్రకటించింది. అయితే, వ్యాక్సిన్ భద్రత, సమర్ధతపై నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ సైతం ఈ వ్యాక్సిన్ గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.