Begin typing your search above and press return to search.
మంటల్లో ఐరోపాలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం!
By: Tupaki Desk | 4 March 2022 2:06 PM GMTఉక్రెయిన్‌పై దురాక్రమణ కోసం.. రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు గగ్గోలు పెడుతున్నా.. ఎవరినీ లెక్క చేయడంలేదు. తను అనుకున్నది సాధించేందుకే మొండి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై విచ్చలవిడిగా విరుచుకుపడుతున్నారు.
తొలుత ప్రజా సమూహాలపై దాడులు చేయబోమని చెప్పిన పుతిన్.. కొన్ని రోజులుగా ఇదే దాడులు చేస్తున్నాడు. అసలు యుద్ధమే లేదన్న ఆయన.. యుద్ధానికి దిగాడు. ఇప్పుడు ఏకంగా..ఉ క్రెయిన్‌కు అత్యంత కీలకమైన.. ముఖ్యంగా ఐరోపాలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంగా ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రాన్ని పేల్చేసే ప్రయత్నం చేశారు.
శుక్రవారం ఉదయం ప్రపంచం నిద్ర నుంచి మేల్కొంటున్న సమయంలో ఈ అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దళాలు విరుచుకుపడ్డా యి. రష్యా దళాలు వేసిన షెల్లింగుల్లో జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం మంటల్లో చిక్కుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
ఈ విషయాన్ని అధికార ప్రతినిధి ఆండ్రీ ట్యూజ్ తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కేంద్రం తాలూకు వీడియోలను ఆయన టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. విద్యుత్ ప్లాంట్‌పై అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత దాడిని నిలిపివేయాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా రష్యా దళాలకు పిలుపునిచ్చారు.
అంతేకాదు.. "ఇది పేలినట్లయితే, అది చోర్నోబిల్ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంటుంది! రష్యన్లు వెంటనే మంటలను ఆపాలి" అని కులేబా ట్వీట్ చేశారు. మరోవైపు.. ఉక్రెయిన్‌లో జరుగుతున్న భీకర యుద్ధం నుంచి తమను తాము రక్షించుకునేందుకు పారిపోతున్న ఉక్రెయిన్ శరణార్థులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఈయూ దేశాలు అంగీకరించాయి.
అదే సమయంలో రొమేనియాలో మానవతా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 10 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు దేశం నుంచి వెడలిపోయారు.
యూరోపియన్ యూనియన్ రష్యాపై ఆంక్షలను మరింత పెంచింది. యుద్ధం 9వ రోజుకు చేరుకోవడం.. రష్యాదూకుడు తగ్గించుకోకపోవడం.. ప్రపంచ దేశాల వినతులను పెడచెవిన పెట్టడం నేపథ్యంలో ఈయూ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక, అమెరికా కూడా ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచింది.
ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్.. ఉక్రెయిన్‌కు రక్షణ కల్పిస్తామని.. దేశానికి గుర్తింపు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌కు చాలా ఉపశమనం లభించే అవకాశం ఉంటుందని అంటున్నారు.