Begin typing your search above and press return to search.
కాన్సంట్రేట్.. కాన్సంట్రేట్.. ఇవిగో చిట్కాలు
By: Tupaki Desk | 13 Nov 2015 10:30 PM GMTపనిలో ఉన్నప్పుడు మీరు ఏకాగ్రతను కోల్పోతున్నారా? 30 నిమిషాల్లో చేయవలసిన పని పూర్తి చేయడానికి మీకు గంట సమయం పడుతోందా, లేదా మీరు పదేపదే మీ ఫోన్ కేసి చూస్తున్నారా లేదా రోజు పొడవునా మీ ఫేస్ బుక్ ను చూస్తుంటారా? అయితే మీలో ఏకాగ్రత లోపించినట్లే లెక్క. టెక్నాలజీతో - అత్యాధునిక గాడ్జెట్లతో ముడిపడిన ఆధునిక జీవితం మనిషి ఏకాగ్రతను దారుణంగా దెబ్బతీస్తోందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లారీ రోసెన్ హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీపై మన వ్యామోహం, మనపై దాని పట్టును అధిగమించటం అనే గ్రంథ రచయిత అయిన రోసెన్ ప్రస్తుతం ఏ ఉద్యోగీ కనీసం 3 నుంచి 5 నిమిషాలకు మించి పనిలో నిమగ్నం కాలేకపోతున్నాడని తెలిపారు. దీనికి కారణం ఈమెయిల్స్ - పాఠ్య సందేశాలు - సోషల్ మీడియా వంటివి మన దృష్టిని ఆకర్షిస్తుండమేనని చెప్పారు.
మొత్తం మీద చెప్పాలంటే మనం పాఠశాలలో ఉన్నా - ఉద్యోగం చేస్తున్నా - లేదా ఇంటిలో ఉన్నా సరే మన దృష్టి పక్కదోవలు పడుతూనే ఉంటోందని రోసెన్ చెబుతున్నారు. ఈ దురలవాటును ఎదుర్కోవాలంటే అలర్ట్ - నోటిఫికేషన్ వంటి సహజ సిద్ద పద్ధతులకంటే, ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ఆధారంగా స్పందించేలా మన మెదడుకు తిరిగి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని రోసెన్ చెబుతున్నారు. ఇలాచేయడం చాలా సులభమే అంటున్నారాయన.
ఉదాహరణకు మీ అలాంరం లేదా టైమర్ ను ఒక నిమిషం కాలానికి సెట్ చేయండి. ఆ సమయంలో ఏదైనా మీ కమ్యూనికేషన్ నెట్ వర్క్ ను తనిఖీ చేసుకోండి. మీరు సెట్ చేసిన 60 సెకన్ల సమయం పూర్తి కాగానే, అలారం లేదా టైమర్ ను 15 నిమిషాలకు సెట్ చేయండి. ఇది ఈరోజుల్లో మనం చూపగల గరిష్ట ఏకాగ్రతా సమయం. ఈ 15 నిమిషాల కాలంలో మీరు ఈమెయిల్స్, పాఠ సందేశాలు, లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను ఏమాత్రం తనిఖీ చేయకుండా పని చేస్తూనే ఉండాలి. ఈ పద్ధతిలో కీలకమైన విషయం ఏమిటంటే, మీ ఫోన్ ను తల్లకిందులుగా ఉంచండి., లేదా సైలెంట్ మోడ్ లో పెట్టండి, అలాగే మీ డెస్క్ టాప్ లోని విండోస్ ను మొత్తంగా మినిమైజ్ చేయడానికి బదులుగా పూర్తిగా మూసేయండి. ఎలాంటి నోటిఫికేషన్లయినా మీరు చూసినా, విన్నా అవి మిమ్మల్ని అటూ ఇటూ కదిలేలా ప్రేరేపిస్తాయి, మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా మీ దృష్టిని, ఏకాగ్రతను అవి మారుస్తాయని రోసెన్ చెప్పారు.
అంతరాయం కలుగకుండా 15 నిమిషాలపాటు ఏకధ్యాసతో మీరు పని చేయగల స్థితిని సాధించారంటే (దీనికి కొద్ది రోజుల నుంచి కొద్ది వారాల సమయం పడుతుంది) తర్వాత దాన్ని 20, 25, 30 నిమిషాల వరకు తీసుకుపోయేందుకు ప్రయత్నించాలని రోజెన్ చెప్పారు. మీరు 30 నిమిషాల వరకు ఏకాగ్రతతో పనిచేసే స్థితికి వచ్చారంటే మీ మెదడు సరిగా పనిచేస్తున్నట్లే లెక్క అట.
కంపెనీలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు గ్రూప్ వారీ సెట్టింగు పద్ధతిని అమలు చేస్తుండటాన్ని తాను గమనించానని రోసెన్ తెలిపారు. మనసు పక్కదోవలు పట్టకుండా ఉండటానికి ప్రతి 15 నిమిషాలకు ఒక సారి ఉద్యోగులు అందరూ తమ ఫోన్‌లను చెక్ చేసుకునేవారు. తమ కమ్యూనికేషన్ నెట్ వర్క్ లను చూడలేకపోతున్నామని ఒత్తిడిని ఇది కాస్త తగ్గించేదని చెప్పారు. అంతరాయం కలగకుండా పని చేసుకునేలా దారి చూపుతున్న ఈ పద్ధతిని అందరూ అలవర్చుకుంటే బాగుంటుంది కదూ.