Begin typing your search above and press return to search.
క్రీడల మంత్రిని కోతి అనేసిన క్రికెటర్
By: Tupaki Desk | 29 Jun 2017 6:25 AM GMTఆయన స్వయానా క్రీడల మంత్రి. ఆటగాళ్లను విమర్శించారన్న ఆగ్రహంతో మంత్రి అన్నది కూడా చూడకుండా మాట్లాడేసి అడ్డంగా బుక్ అయ్యాడో స్టార్ ఆటగాడు. క్రీడల మంత్రిని కోతిగా వ్యాఖ్యానించటం ద్వారా సంచలనం సృష్టించారు శ్రీలంక క్రికెటర్.. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ.
సిత్రమైన బౌలింగ్ స్టైల్లో అందరిని ఆకట్టుకునే మలింగ తాజా వ్యాఖ్యలు శ్రీలంకలో పెను దుమారాన్నే రేపాయి. మలింగ ఇంత మాట అనటానికి దారి తీసిన పరిణామాలు చూస్తే.. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫిలో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన చేయటంపై ఆ దేశ క్రీడల మంత్రి దయాసిరి జయశేఖర విమర్శలు చేశారు.
ఆటగాళ్ల ఫిట్ నెస్ సరిగా లేదని.. క్యాచ్ లు కూడా సరిగా పట్టలేకపోయారంటూ విమర్శలు చేశారు. దీనిపై మలింగ రియాక్ట్ అయ్యారు. మంత్రిని కోతితో పోలిస్తే వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు. మలింగ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. క్రీడల మంత్రిని అంత మాట అనేయటంపై పలువురు తప్పు పట్టారు. ఇదిలా ఉంటే.. ఈ ఉందంతంపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ కమిటీని వేసింది. విచారణకు హాజరైన మలింగ తన మాటలకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ.. ఆయన వ్యాఖ్యల్ని సిరియస్ గా తీసుకున్న కమిటీ అతనిపై చర్యలకు రికమండ్ చేసింది. దీనిపై నిర్ణయం తీసుకన్న శ్రీలంక క్రికెట్ బోర్డు.. మలింగపై ఏడాది పాటు నిషేధం విధించింది. అయితే.. శిక్షను ఆర్నెల్ల పాటు సస్పెన్షన్‌లో ఉంచింది. అంతేకాదు.. తన తదుపరి వన్డే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. నోరు జారితే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం మలింగకు తాజా ఎపిసోడ్ లో బాగానే అర్థమై ఉంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/