Begin typing your search above and press return to search.
నామినేషన్లకు ఇక ఒక్క రోజే!
By: Tupaki Desk | 23 March 2019 6:12 AM GMTఏపీ - తెలంగాణల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్లకు మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ వారం మొదట్లో సోమవారం రోజున మొదలైన నామినేషన్ల ప్రక్రియ మొత్తం ఐదు రోజుల పాటు సాగింది. శనివారం నామినేషన్లను అధికారులు తీసుకోవడం లేదు. ఆదివారం కూడా సెలవు దినమే. అయితే సోమవారం నామినేషన్లకు తుది గడువు. పెండింగ్ ఉన్న నేతలంతా సోమవారం రోజున నామినేషన్లను వేయడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పటికే దాదాపుగా మెజారిటీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీల తరఫు నుంచి, చిన్నాచితక పార్టీల నుంచి - స్వతంత్రులు.. అందరూ నామినేషన్లను దాఖలు చేసేశారు. ఆయా పార్టీల అధినేతలు కూడా నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు.
బుధ, గురు, శుక్ర వారాల్లో దాదాపుగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పార్టీలన్నీ ఆ పని పూర్తి చేశాయి. సోమవారం రోజున నామినేషన్లు ఏవీ పడలేదు. మంగళవారం ముహూర్తం బాగోలేదని ఎవరూ పెద్దగా నామినేషన్లు దాఖలు చేయలేదు. అయితే బుధ - గురు - శుక్రవారాల్లో మాత్రం నామినేషన్లు వెల్లువెత్తాయి.
అటు చంద్రబాబు నాయుడి తరఫు నుంచి శుక్రవారమే నామినేషన్ దాఖలైంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా శుక్రవారమే నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లోనూ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇలా పార్టీల అధినేతలే కాదు..ఆయా పార్టీల నేతలంతా కూడా నామినేషన్లను దాఖలు చేసేసినట్టే అని తెలుస్తోంది.
సోమవారం అయితే ఇంకా అవకాశం ఉంది. నూటికి తొంబై ఐదు శాతం నామినేషన్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని, సోమవారం మాత్రం కొందరు నామినేషన్ వేసుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుండటం ఒక ఎత్తు అయితే - నామినేషన్ల పరిశీలన - నామినేషన్ల ఉపసంహరణలు తదుపరి కీలక ఘట్టాలు!