Begin typing your search above and press return to search.
శ్రీదేవిని చివరగా చూసిందెవరు?
By: Tupaki Desk | 26 Feb 2018 1:19 AM GMTసెలబ్రిటీ జీవితమే కాదు - మరణమూ ఒక సంచలనమే. సాధారణ మరణం అనుకుంటున్న శ్రీదేవి చివరి క్షణాల్లోనూ ఎన్నో అనుమానాలు - ఇంకెన్నో ప్రశ్నలు. హోటల్ గదిలో ఆమెను అపస్మారక స్థితిలో చూసి బోనీ కపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారన్న వార్తలు అన్నింటా వచ్చిన నేపథ్యంలో శ్రీదేవిని ఆ స్థితిలో గుర్తించింది ఆయన కాదన్న వార్తలు ఇపుడు బయటకు వస్తున్నాయి. ఆ రాత్రి హోటల్లో జరిగిన ఘటన వేరు అని అంటున్నారు.
మరణానికి కొద్దిసేపటి ముందు శ్రీదేవి తన ఉంటున్న హోటల్ రూమ్ సర్వీస్ కు ఫోన్ చేసిందట. మంచి నీళ్ల తెమ్మని చెప్పిందట. అయితే - రూమ్ సర్వీస్ ఆమె గదికి వెళ్లడానికి 15 నిమిషాలు పట్టింది. అయితే, అతను వెళ్లే సమయానికి ఆమె ఏ స్థితిలో ఉందో గాని ఎన్ని సార్లు కాలింగ్ బెల్ నొక్కినా తలుపు తీయలేదు. గట్టిగా తలుపు తట్టినా లోపల నుంచి రెస్పాన్స్ రాలేదు. ఎవరి గొంతూ వినిపించలేదు. దీంతో సర్వీస్ స్టాఫ్ అనుమానం వచ్చి బలవంతంగా తలుపును తెరిచారు. వారికి అపస్మారక స్థితిలో పడి ఉన్న శ్రీదేవి కనిపించింది. ఆమె పల్స్ కొట్టుకుంటున్నట్లు స్టాఫ్ గుర్తించారు. మరి తర్వాత బోనీ వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారా? లేక హోటల్ స్టాఫ్ ఆమెను ఆస్పత్రికి తరలించారా? అన్నది ఇంకా వివరం తెలియాల్సిన ప్రశ్న. మరి అడిగిన వెంటనే మంచినీళ్లు అంది ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదా? అన్నది కూడా ఒక ప్రశ్న. ఆమె అపస్మారక స్థితికి చేరడానికి... బోనీ ఆమె వద్దకు రావడానికి మధ్య ఎంత సమయం ఉందనే విషయంపై పూర్తి సమాచారం లేదు.
ఇదిలా ఉండగా ఆమె దుబాయ్ వెళ్లింది తన బంధువుల పెళ్లి కోసం మాత్రమే కాదట. స్వయంగా చిత్రకళ తెలిసిన శ్రీదేవి తన పెయింటింగ్స్ తో అపుడపుడు ఎగ్జిబిషన్ పెడుతుందట. అలా ఈసారి తన చిత్రాల వేలం మరియు ప్రదర్శన కూడా ఏర్పాటుచేసిందట. దుబాయ్ ట్రిప్ కు అది కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు.