Begin typing your search above and press return to search.
ఈ రోజూ..రేపే.. పార్టీల అంతిమ అస్త్రాలు!
By: Tupaki Desk | 8 April 2019 5:06 AM GMTదాదాపు నెల రోజుల కిందట పీక్స్ కు చేరిన ఎన్నికల ప్రచార పర్వం ఈ రోజు, రేపటితో ముగియనుంది. దేశమంతా ఇంకా ఎన్నికల సంగ్రామం కొనసాగుతూ ఉండినా.. ఏపీ- తెలంగాణల్లో మాత్రం ఈ రోజు, రేపటితో ప్రచార హోరు ముగియనుంది. తొమ్మిది తేదీతో తొలి విడత పోలింగ్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. ఆ తర్వాత ఒక రోజు విరామం. ఆ మరుసటి రోజు పోలింగ్.
ఈ నేపథ్యంలో పార్టీలు తమ తమ తుది అస్త్రాలను సంధిస్తూ ఉన్నాయి. విరుచుకుపడే వాళ్లు విరుచుకుపడుతున్నారు. సంచలన ఆరోపణలు చేసే వాళ్లు ఆఖరి అస్త్రాలను సంధిస్తూ ఉన్నారు. ఇక ఆడియో, వీడియో టేపుల విడుదల సంగతి సరేసరి. ఎవరికి వారు రెచ్చిపోతూ ఉన్నారు.
అయితే ఎంత ప్రచారం చేసినా.. ఈ రోజు, రేపు మాత్రమే. వీళ్ల ప్రచారాన్ని అంతా విని.. వినీ.. ప్రజలు ఈ నెల పదో తేదీన బేరీజు వేసుకోవాలి. ఎవరి ప్రచారం ఆకట్టుకుని ఉంటే, ఎవరు నమ్మకంగా అనిపించి ఉంటే వారికి ప్రజలు ఓటేసే అవకాశం ఉంది. అయితే ప్రజలు కేవలం ప్రచారాన్ని బట్టి ఓటు వేస్తారని అనుకోవడం భ్రమ. ఐదేళ్ల పరిణామాలన్నింటి మీద కలిసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. అందుకు సంబంధించిన తీర్పునే వారు పోలింగ్ రోజు ఇస్తారు.
అయితే ప్రచారం మాత్రం పార్టీలకు ప్రాణప్రదం. ప్రచారంలో వెనుకబడితే ఎన్నికల ముందే ఓడిపోయారనే పరిస్థితి ఉంటుంది. అందుకే… పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. దానికి కూడా గడువు ముంచుకు వస్తోంది.
ఈ రోజు - రేపు ప్రచారం లో నేతలు మరిన్ని సంచలన ఆరోపణలు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పదో తేదీ మాత్రం ప్రచారం ఉండదు. కేవలం ప్రలోభాలు మాత్రమే ఉంటుంది. ఆ రోజున నేతలు పంపకాల విషయంలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. పదకొండో తేదీవీరి భవితవ్యానికి సంబంధించిన పోలింగ్ జరగనుంది!