Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రజలారా చివరి వార్నింగ్ వచ్చేసినట్లే

By:  Tupaki Desk   |   28 April 2021 1:30 PM GMT
తెలంగాణ ప్రజలారా చివరి వార్నింగ్ వచ్చేసినట్లే
X
అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులతో రెండు తెలుగు రాష్ట్రాలు కిందామీదా పడుతున్నాయి. కరోనా తీవ్రత పెద్దగా లేనట్లుగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఆక్సిజన్ కొరత ఆ రాష్ట్రంలో కనిపిస్తున్నా.. అలాంటిదేమీ లేదన్న మాట ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో మాదిరి తెలంగాణలోని కోవిడ్ పరిస్థితి గురించి ప్రజాప్రతినిధులు ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. అప్పుడప్పుడు వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడటమే తప్పించి.. మరెవరూవ్యాఖ్యానించటం లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా పరిస్థితిపై రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రియాక్టు అయ్యారు. గడిచిన వారం రోజులుగా చూస్తే.. తాజాగా కొత్త కేసుల నమోదులో స్థిరత్వం కనిపిస్తోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సహకరిస్తున్నారన్న ఆయన.. రానున్న మూడు.. నాలుగు వారాలు చాలా కీలకంగా వ్యాఖ్యానించారు. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావటంతో.. మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.

విరేచనాలు.. జ్వరం.. వాసన కోల్పోవటం.. రుచి తెలినివాళ్లు మాత్రమే కోవిడ్ టెస్టుకు రావాలన్నారు. కొవిడ్ టెస్టింగ్ కేంద్రాల్లో గుంపులుగా ఉండటం సరికాదని.. సాధారణ లక్షణాలు రెండు మూడు రోజులకు తగ్గకున్నా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కోవిడ్ బాధితులకు పడకలు ఉన్నాయని.. కేసుల సంఖ్య మరింత పెరిగినా.. ఇబ్బంది లేదన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రులు కలుపుకొని 50 వేల పడకల్ని కేటాయించామని.. కోవిడ్ సోకిన వారిలో 85 శాతం మందికి ఆసుపత్రి అవసరం లేదన్నారు. ఆక్సిజన్.. మందులు.. ఆసుపత్రిలో బెడ్ల విషయంలో రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందన్న సాయన.. టీకా వేసుకున్న వారిలో 80 శాతం మందికి కోవిడ్ సోకలేదన్నారు. 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతుందన్న ఆయన.. రానున్న మూడు నాలుగు వారాలు కీలకమని. ఈ గండం నుంచి గట్టెక్కితే.. రెండో వేవ్ నుంచి తప్పించుకున్నట్లేనని చెబుతున్నారు.