Begin typing your search above and press return to search.

అమెరికా పౌరసత్వం..మనోళ్లే టాప్..

By:  Tupaki Desk   |   19 Sep 2018 7:47 AM GMT
అమెరికా పౌరసత్వం..మనోళ్లే టాప్..
X
ప్రపంచానికి పెద్దన్న అమెరికా.. ఆ కలల దేశం వెళ్లాలని ఎంతో మంది కలలుగంటారు. అగ్రరాజ్యంలో ఉండిపోవాలని ఉబలాటపడుతారు. ఆ దేశ పౌరసత్వం కోసం ఏళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు.. ట్రంప్ అధ్యక్షుడయ్యాక విదేశాల నుంచి వలసలు తగ్గిపోగా.. ఆయన పొగబెడుతూ అమెరికాలో ఉన్న ఇతర దేశాల ప్రజలను కూడా వెళ్లిపోయేలా చేస్తున్నాడు. అందుకే ఈ మధ్య అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు - ఉద్యోగుల సంఖ్య బాగా తగ్గింది. ప్రపంచంలోని అందరిని చీ కొడుతున్న అమెరికా.. మనల్ని మాత్రం నెత్తిన పెట్టుకుంటోందని తాజా గణంకాలను బట్టి అర్థమవుతోంది..

అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య తాజాగా పెరగడం విశేషం. 2016తో పోల్చితే 2017లో 10శాతం మేర వృద్ధి కనిపించింది. ఏకంగా ఈ సంవత్సరం 50వేల మంది అమెరికా దేశ పౌరసత్వం పొందడం గమనార్హం. అయితే ఇదే సమయంలో అమెరికా దేశ పౌరసత్వం పొందిన మిగతా దేశస్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2016తో పోల్చితే 2017లో 6శాతానికి పడిపోయింది.

ఇక లెక్కలు చూస్తే 2016-17 మధ్య అమెరికా పౌరసత్వం పొందిన వారిలో అత్యధికులు మెక్సికన్లు కాగా. రెండోస్థానంలో భారతీయులున్నారు. మొత్తం 7 లక్షల మందికి అమెరికా ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వగా అందులో 7శాతం మంది భారతీయులు ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ లెక్కన అందరినీ చీ కొడుతున్న అమెరికా .. పక్కనున్న మెక్సికన్లతో పాటు భారతీయులను నెత్తిన పెట్టుకుంటున్నట్టు అర్థమవుతోంది.