Begin typing your search above and press return to search.

బీసీసీఐపై లతా మంగేష్క‌ర్ ముద్ర‌!

By:  Tupaki Desk   |   6 Feb 2022 12:30 PM GMT
బీసీసీఐపై లతా మంగేష్క‌ర్ ముద్ర‌!
X
బీసీసీఐపై కూడా గాన కోకిల ల‌తా మంగేష్క‌ర్ త‌న‌దైన‌ ముద్ర వేసారు. ఇండియ‌న్ టీమ్ ని ఆర్ధికంగా ఆదుకోవ‌డానికి గాన కోకిల ముందుకొచ్చారు. క‌పిల్ దేవ్ సార‌థ్యంలోని ఇండియ‌న్ టీమ్ 1983 లో వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే అప్ప‌టి క్రికెట్ బోర్డ్ అంత ధ‌న‌వంత‌మైన‌ది కాదు. ఇప్ప‌టి రోజుల్లా అప్ప‌ట్లో క్రికెట‌ర్ల‌పై కాసుల వ‌ర్షం కురిసేది కాదు. కేవ‌లం మ్యాచ్ ఆడినందుకు ఫీజ్ త‌ప్ప‌..ఇంకే ర‌క‌మైన ప్రోత్సాహాలు ఉండేవి కావు. అలాంటి స‌మ‌యంలో ఇండియా తొలిసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ని ముద్దాడింది. దీంతో బీసీసీ ఆ టీమ్ కి ఏదైనా చేయాల‌ని డిసైడ్ అయింది. అప్ప‌టి బీసీసీఐ అధ్య‌క్షుడు..ప్ర‌ధాని ఇందిరా గాంధీ..మంత్రి ఎ న్ కేపీ సాల్వే టీమ్ ని ఎంక‌రేజ్ సెల‌బ్రేట్ చేయాల‌నుకున్నారు.

దీని కోసం సాల్వే ..రాజ్ సింగ్ దుంగార్ పూర్ ని సంప్ర‌దించారు. ఢిల్లీలోని జ‌వ‌హార్ లాల్ నెహ్రూ స్టేడియంలో క‌చేరీ చేయాల‌ని త‌న స్నేహితురాలైన క్రికెట్ అభిమాని ల‌తా మంగేష్క‌ర్ ని దుంగార్ పూర్ అభ్య‌ర్ధించారు. దానికి ఆమె వెంట‌నే ఒప్పుకున్నారు. కిక్కిరిసిన స్టేడియంలో ల‌తాజీ రెండు గంట‌ల పాటు క‌చేరి చేసారు. బీసీసీ ఆ క‌చేరి నుంచి చాలా డ‌బ్బు సేక‌రించింది. అలా మొత్తంగా వ‌చ్చిన డ‌బ్బుతో 14 మంది ఆట‌గాళ్ల‌కు ఒక్కొక్కరికి ల‌క్ష చొప్పున ప్రైజ్ మ‌నీ రూపంలో అందించారు. దీనికి సంబంధించి అప్ప‌టి టీమ్ స‌భ్యుడు సునీల్ వాల్స‌న్ ఆ జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకున్నారు.

``ఇది అప్ప‌ట్లో చాలా పెద్ద మొత్తం. ఆమె స‌హ‌కారాన్ని బీసీసీఐ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేదు. ఆమె పాడ‌టం ప్ర‌త్య‌క్షంగా చూడ‌టం మ‌రిచిపోలేనిది. గౌర‌వ సూచికంగా భార‌త‌దేశంలో ప్ర‌తీ స్టేడియంలో ల‌తాజీ కోసం రెండు వీఐపీ పాస్ లు కేటాయిస్తారు. మంగేష్క‌ర్ కుటుంబానికి క్రికెట్ అంటే ఎంతో పిచ్చి` అని అన్నారు. ముంబైకి చెందిన సీనియ‌ర్ స్పోర్స్ట్ జ‌ర్న‌లిస్ట్ మాట్లాడుతూ ``60వ ద‌శ‌కంలో ల‌తాజీ క్ర‌మం తప్ప‌కుండా సిసిఐ స్టేడియానికి వ‌చ్చేవారు. ఆ త‌ర్వాత 70..80 ద‌శ‌కంలో వాంఖ‌డే స్టేడియంలో క‌నిపించేవారు.

లతాజీ..ఆమె సోద‌రుడు హృద‌య‌నాథ్ మంగేష్క‌ర్ లు టెస్ట్ మ్యాచులు చూసేందుకు బ్ర‌బౌర్న్ స్టేడియానికి వ‌చ్చేవారు. ఆమె ఎంత బిజీగా ఉన్నా 70ల్లో వ‌చ్చే ప్ర‌తీ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తి క‌న‌బ‌రిచేవారు`అని తెలిపారు.