Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ పొలికిట్ ఎంట్రీపై ల‌తా కీల‌క వ్యాఖ్య‌

By:  Tupaki Desk   |   4 Oct 2017 9:55 AM GMT
ర‌జ‌నీ పొలికిట్ ఎంట్రీపై ల‌తా కీల‌క వ్యాఖ్య‌
X
త‌లైవా పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు ఆయ‌న స‌తీమ‌ణి ల‌తా ర‌జినీకాంత్‌. రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న సంకేతాలు అందుతున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ ర‌జిని త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆచితూచి మాట్లాడారే త‌ప్పించి నోరు విప్పింది లేదు. ఇందుకు భిన్నంగా ర‌జినీ స‌తీమ‌ణి ల‌తా మాత్రం త‌న భ‌ర్త రాజ‌కీయాల్లోకి వ‌స్తే మంచి జ‌రుగుతుంద‌ని.. అందుకోసం అనేక ప‌థ‌కాల్ని సిద్ధం చేసుకుంటున్నార‌ని చెప్పారు.

త‌న భ‌ర్త రాజ‌కీయ ఆరంగేట్రం గురించి త‌మ కుటుంబ స‌భ్యులంతా ఎదురుచూస్తున్న‌ట్లుగా ఆమె చెప్పారు. ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా త‌మ కుటుంబం స్వాగ‌తిస్తుంద‌ని పేర్కొన్నారు. ర‌జ‌నీ రాజ‌కీయాల్లో క‌చ్ఛితంగా విజ‌యం సాధిస్తార‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ల‌తా ర‌జినీకాంత్ నిర్వ‌హిస్తున్న ఒక ఎన్జీవో కార్య‌క్ర‌మాల్ని వివ‌రించేందుకు మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స్పందించారు.

ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే మార్పు త‌థ్య‌మ‌ని ఆమె చెప్ప‌టం ఒక విశేష‌మైతే.. రాజ‌కీయాల గురించి ఇంత వ‌ర‌కూ స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించ‌ని త‌న భ‌ర్త తీరుకు భిన్నంగా అనేక ప‌థ‌కాల్ని సిద్ధం చేస్తున్న‌ట్లుగా చెప్పి బ్యాక్ గ్రౌండ్ లో జ‌రుగుతున్న వ‌ర్క్ కు సంబంధించిన సంకేతాల్ని ఇచ్చిన‌ట్లుగా చెప్పాలి.

త‌న రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతున్నారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్. ఇలాంటి వేళ‌.. ల‌తా ర‌జినీకాంత్ సైతం త‌న భ‌ర్త పొలిటిక‌ల్ ఎంట్రీ మీద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. ల‌తా వ్యాఖ్య‌ల్ని చూస్తే ర‌జ‌నీ కొత్త‌గా పార్టీ పెట్ట‌నున్నారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా ఉన్నాయ‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ ర‌జినీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే బీజేపీలో చేర‌తార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ప‌లు ప‌థ‌కాల్ని సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా చెప్ప‌టం ద్వారా త‌లైవా కొత్త పార్టీ పెట్ట‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది.

మొత్తానికి ఇద్ద‌రుప్ర‌ముఖ క‌థానాయ‌కులు ఇంచుమించు ఒకే స‌మ‌యంలో పొలిటిక‌ల్ పార్టీలు పెట్ట‌బోతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. ఈ ఇద్ద‌రి ఎంట్రీతో త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో విశేష‌మైన మార్పులు చోటు చేసుకోవ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.