Begin typing your search above and press return to search.
అమ్మకు కూతురుందని ఆమె కన్ఫర్మ్ చేసింది
By: Tupaki Desk | 2 Dec 2017 5:34 AM GMTఅమ్మగా అందరి మదిని దోచుకన్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత అంశానికి సంబంధించిన ఒక అంశం కొద్దిరోజులుగా సంచలనంగా మారింది. అవివాహితగా చెప్పే జయలలితకు పెళ్లి కానప్పటికీ ప్రముఖ నటుడు శోభన్ బాబు ద్వారా ఒకరికి జన్మనిచ్చినట్లుగా వార్త బయటకు వచ్చింది.
అమ్మ మరణం తర్వాత బయటకు వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు అంతకంతకూ ముదురుతోంది. అనారోగ్యంతో అమ్మ మరణించలేదని.. శశికళ బృందమే ఆమెను హతమార్చిందని ఆరోపించి కొత్త కలకలాన్ని రేపారు అమ్మ చిన్ననాటి స్నేహితురాలు గీత.
తాజాగా ఆమె మరో సంచలన ప్రకటన చేశారు. అమ్మకు ఒక కూతురు ఉందని.. అమృత జయ బిడ్డేనని చెప్పారు. సేలంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. నటుడు శోభన్ బాబు కారణంగా జయలలితకు ఆడబిడ్డ పుట్టిందన్నారు. జయకు కుమార్తె ఉన్న విషయం శశికళకు తెలుసని.. ఆ మాటకు వస్తే అమ్మ వీర విధేయుడు పన్నీర్ సెల్వంకు కూడా తెలుసన్నారు. పెళ్లి కాకుండానే తనకు కుమార్తె ఉందన్న విషయం బయటకు వస్తే తన పరువు పోతుందన్న భయంతో బెంగళూరులో ఉన్న తన సోదరి శైలజకు అమృతను అప్పగించినట్లు చెప్పారు.
అమ్మ ఆదేశాల మేరకే అమృత తన సోదరి శైలజ దంపతుల కుమార్తెగా పెరిగిందన్నారు. 1996 నుంచి జయను అమృత కాంటాక్ట్ చేసేదని.. అమ్మ డబ్బులు.. ఆస్తుల్ని ఆమె ఎప్పుడూ ఆశించలేదన్నారు. జయ కుమార్తెగా తాను ఉంటే చాలని భావించిందని.. కావాలంటే తన మాట అబద్ధమైతే.. అమృతకు డీఎన్ఏ పరీక్షలు జరిపితే అసలు విషయం బయటకు వస్తుందన్నారు. 1999లోతాను శోభన్ బాబు ఇంటికి వెళ్లినప్పుడు తనకు కుమార్తె ఉందని.. ఆమె పేరు అమృత అని తనకు చెప్పారన్నారు. జయ చిన్ననాటి స్నేహితురాలి నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.