Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ నేత ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు !

By:  Tupaki Desk   |   15 Jun 2021 9:30 AM GMT
టీఆర్ఎస్ నేత ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు !
X
దేశంలో , రాష్ట్రంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే , కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వంవిధించిన లాక్‌ డౌన్‌ ఇంకా అమల్లోనే ఉంది. లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ , ఇంకా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. అలాగే లాక్ డౌన్ నియమాలని ను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటుంటున్నారు. మరోవైపు కొందరు మాత్రం మాకివేం వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తాము ఈ నిబంధనలు మాకు వర్తించవు అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

వికారాబాద్ జిల్లాలో ఓ టీఆర్ ఎస్ నేత ఒకరు లాక్‌ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసి వందల మందిని ఆహ్వానించారు. డీజే పాటలతో,యువతుల నృత్యాలతో హోరెత్తించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని చెబుతున్న పోలీసులు కొన్నిచోట్ల ఇలా చూసీ చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 6గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే జరిమానా విధించే పోలీసులు, ఈ రికార్డింగ్ డ్యాన్సులను మాత్రం ఎందుకు ఆపలేదని నిలదీస్తున్నారు. సదరు నేతపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చేందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒకరు లాక్‌ డౌన్‌ ఆంక్షలు తుంగలో తొక్కి తన ఇంట్లో అర్థరాత్రి రికార్డు డ్యాన్స్‌ లతో హోరెత్తించాడు. వందలమందిని ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌అవ్వడం తో పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.నిజానికి దిర్సంపల్లి గ్రామంలో కరోనా కేసులు కూడా ఎక్కువే ఉన్నాయని చెబుతున్నారు. అదేమీ పట్టించుకోకుండా మొగులయ్య ఇలా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడంపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొగులయ్య గతంలోనూ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలున్నాయి.