Begin typing your search above and press return to search.

మోడీని బాయ్ కాట్ చేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   7 March 2022 6:01 AM GMT
మోడీని బాయ్ కాట్ చేస్తున్నారా ?
X
దేశ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కార్యక్రమాలను నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు బాయ్ కాట్ చేస్తున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎక్కడా కనబడలేదు.

ముంబాయి లోనే ఉన్న ముఖ్యమంత్రి మోడీ పర్యటనకు ఎందుకు వెళ్ళలేదంటే బాయ్ కాట్ చేస్తున్నారనే మాటలు వినబడుతున్నాయి. ఎందుకంటే నాన్ బీజేపీ ముఖ్యమంత్రులను కేంద్రం పెడుతున్న ఇబ్బందులతోనే అందరు మండిపోతున్నారు. ఠాక్రే ప్రభుత్వాన్ని గవర్నర్ కోషియారీ పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే గవర్నర్ తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న ముఖ్యమంత్రి పదే పదే ఆరోపిస్తున్నారు.

బీజేపీ ప్రభుత్వాల రాష్ట్రాల్లో ఒకలాగ నాన్ బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్లు మరోలాగ వ్యవహరిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. నాన్ బీజేపీ ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్నందుకు కారణం నరేంద్ర మోడీయే అనే బలమైన ఆరోపణలున్నాయి. అయినా కేంద్రం తన పద్దతిని మార్చుకోవటం లేదు. ఇందుకనే మోడి తమ రాష్ట్రాలకు వచ్చినపుడు ముఖ్యమంత్రులు కార్యక్రమాలను బహిష్కరిస్తున్నారు.

నిజంగా ముఖ్యమంత్రుల బహిష్కరణ మోడీకి అవమానమనే చెప్పాలి. అయినా మోడీ తన పద్దతిని మార్చుకోవటం లేదు. మొన్ననే మోడీ హైదరాబాద్ కు వస్తే కేసీయార్ బహిష్కరించారు. అంతకుముందు తమిళనాడుకు వెళ్ళినపుడు స్టాలిన్ కూడా మోడీ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా మోడీ కార్యక్రమాలను బహిష్కరించారు. ఇక బెంగాల్ సీఎం మమత బెనర్జీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

మోడీ కార్యక్రమాలను ముఖ్యమంత్రులు బహిష్కరించటం మమతా బెనర్జీతోనే మొదలైంది. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మోడికి మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులాగ తయారైంది. వీళ్ళకు తోడు పంజాబ్ సీఎం చన్నీ కూడా ఆ మధ్య మోడీ కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇలా నాన్ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు తన కార్యక్రమాలను బహిష్కరిస్తున్నా మోడీ వైఖరిలో ఎలాంటి మార్పు కనబడకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.