Begin typing your search above and press return to search.

బలవంతపు శృంగారం.. భర్త పురుషాంగాన్ని కోసేసిన భార్య

By:  Tupaki Desk   |   14 Dec 2021 5:26 PM IST
బలవంతపు శృంగారం.. భర్త పురుషాంగాన్ని కోసేసిన భార్య
X
ఇప్పటికే వారిద్దరూ ఆలుమగల మధ్య గొడవలున్నాయి. ఒకసారి కొట్టుకొని పుట్టింటికి కూడా వెళ్లి వచ్చింది ఆ ఇల్లాలు. ఆ తర్వాత పెద్దలు రాజీ కుదుర్చి కాపురం చేసుకోమన్నారు. కానీ ఆ మొగుడు మళ్లీ చావబాదుతున్నాడు. ఈసారి గొడవ పెట్టుకొని బలవంతంగా బట్టలన్నీ విప్పేసి బలత్కారానికి పాల్పడ్డాడు. కోపం కట్టలు తెంచుకున్న భార్య.. భర్త పురుషాంగాన్ని కోసేసింది.

తనకు ఇష్టం లేదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా దుస్తులు తొలగించి పశువు మాదిరిగా బలవంతంగా శృంగారం చేయడానికి ప్రయత్నించాడని భర్త పురుషాంగాన్ని భార్య కోసేసింది. ఈ మేరకు తన భర్త చేసిన బలవంతపు సెక్స్ పై పోలీసులకు చెప్పుకొచ్చింది.

మధ్యప్రదేశ్ లో తాజాగా చోటుచేసుకున్న ఈ ఉదంతం వైరల్ గా మారింది. బలవంతపు శృంగారాన్ని భరించలేని స్థితిలో ఓ భార్య కోపోద్రిక్తులైన కత్తితో భర్త పురుషాంగాన్ని కోసేసింది. ఈ ఘటనలో పోలీసులు ఆమెపై ఐసీసీ సెక్షన్ 324 కింద కేసు పెట్టారు. సంచలనంగా మారిన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని టికామ్ ఘర్ జిల్లా కేంద్రంలోని జతారా పోలీస్ స్టేషన్ లో 26 ఏళ్ల వ్యక్తి తన భార్య (24)పై ఫిర్యాదు చేశాడు. ఈనెల 7వ తేదీన ఇంట్లో శృంగారం కోసం ప్రయత్నించగా భార్య కత్తితో తన పురుషాంగాన్ని కోసేసిందని.. రక్తం కారిపోతున్న స్థితిలో ఆస్పత్రిలో చేరానని.. ఆపరేషన్ కారణంగా ఆలస్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చానని ఆ వ్యక్తి తెలిపారు. పోలీసులు డాక్టర్ల రిపోర్టు పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి భార్యపై కేసులు పెట్టారు.