Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై తాజా ఛార్జిషీట్లో కీలకాంశాలు?

By:  Tupaki Desk   |   21 Dec 2022 4:30 AM GMT
లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై తాజా ఛార్జిషీట్లో కీలకాంశాలు?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తాజాగా ఈడీ ఛార్జిషీట్ సంచలనంగా మారింది. అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న కవితపేరును పలుమార్లు ప్రస్తావించటం మాత్రమే కాదు.. పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది. తాజాగా వెలుగు చూసిన ఈడీ ఛార్జిషీట్ లోని అంశాల్ని చూస్తున్నప్పుడు.. రానున్న రోజుల్లో ఈ ఎపిసోడ్ లో కవితకు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న భావన కలుగక మానదు.

ఈ ఛార్జిషీట్ లో స్వల్ప వ్యవధిలో కవిత తన 10 సెల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లుగా పేర్కొన్నారు. సెల్ ఫోన్లు మార్చటం పెద్ద విషయం కాదు. హైప్రొఫైల్ లో ఉన్న వ్యక్తులు తరచూ ఫోన్లు మార్చటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. వాడేసిన ఫోన్లను ధ్వంసం చేయటం ఏమిటి? అన్న ప్రశ్న వద్దే ఆగిపోతోంది. ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో కవితతో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి.. మాగుంట రాఘవరెడ్డి.. ముత్తా గౌతమ్.. అరుణ్ రామచంద్రన్ పిళ్లై.. అభిషేక్ రావుల పేర్లను ఈడీ ప్రస్తావించింది. సమీర్ మహేంద్రు కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాల్లో కీలకమైనవి చూస్తే..

- ఒబేరాయ్ హోటల్లో సమావేశం జరిగింది. ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి తన సొంత విమానంలో హైదరాబాద్ వెళ్లారు.

- ఇండో స్పిరిట్స్ లో ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉంది. ఒబరేయ్ హోటల్లో జరిగిన మీటింగ్ లో కవిత.. అరుణ్ పిళ్లై.. దినేష్ అరోరా.. విజయ్ నాయర్ పాల్గొన్నారు. ఇండో స్పిరిట్ ను కవిత వెనుక ఉండి నడిపించారు. ఈ సంస్థలో నిజమైన భాగస్వామ్యులు కవిత.. మాగుంట శ్రీనివాస్ రెడ్డి.

- సౌత్ గ్రూప్ పేరిట రూ.192 కోట్ల లిక్కర్ దందా జరిగింది. 2022 జనవరిలో హైదరాబాద్ లోని కవిత నివాసానికి సమీర్ మహేంద్రు వెళ్లి కలిశారు. ఇండో స్పిరిట్స్ కంపెనీ నిర్వాహణపై అతడు కవితతో చర్చించారు.

- సమీర్ మహేంద్రుకు అరుణ్ పిళ్లై తన ప్రతినిధిగా కవిత చెప్పారు. ఇండో స్పిరిట్స్ కు రూ.192.8 కోట్ల లాభం వచ్చినట్లుగా ఛార్జిషీట్లో పేర్కొన్నారు.

- ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తర్వాతే వాటా తీసుకునేందుకు కవిత తరఫున శ్రీనివాస్ రావు ముందుకు వచ్చారు.

- ఇండో స్పిరిట్స్ లో సమీర్ మహేంద్రుకు 35 శాతం వాటా.. బుచ్చిబాబుకు 16.25 శాతం.. అరుణ్ పిళ్లైకు 16.25 శాతం.. మాగుంట రాఘవరెడ్డికి 32.5 శాతం వాటా ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.