Begin typing your search above and press return to search.
గంటా టార్గెట్ అదేనా... ?
By: Tupaki Desk | 22 Dec 2021 12:30 PM GMTఏపీలో గంటా శ్రీనివాసరావు సీనియర్ నేత. పైగా ఆయన పలు మార్లు మంత్రిగా పనిచేశారు. ఇక ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా బలమైన నేతగా ఉన్నారు. అలాంటి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచే పొలిటికల్ గా ఎదిగారు. ఆయన ఒక్కో మెట్టూ చకచకా ఎక్కి విశాఖ జిల్లాలో మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లోనే కీలకంగా మారారు. ఆయన తనకంటూ ఒక బలమైన వర్గాన్ని ఎపుడూ ఉంచుకుంటారు అని పేరు.
అలాంటి గంటా శ్రీనివాసరావు కాపుల ఐక్యత గురించి తాజాగా చేసిన కామెంట్స్ పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. గంటా వంటి నాయకుడు ముందుకు కదిలితే అనుసరించే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఏపీలో బలమైన కాపు నాయకులు కనీసం యాభై మంది దాకా గంటాకు మద్దతుదారులు అని అప్పట్లోనే ప్రచారం జరిగింది.
ఇక గంటా కూడా తన రాజకీయాలను మారుస్తున్నారు అన్న టాక్ ఉంది. ఆయనను టీడీపీలో ఒక మామూలు లీడర్ కిందనే చంద్రబాబు చూస్తున్నారు అని ఆయన వర్గం కుములుతోంది. కనీసం పొలిటి బ్యూరో మెంబర్ గా కూడా నియమించలేదు. అంతే కాదు, టీడీఎల్పీ ఉప నాయకుడి పదవి ఇవ్వలేదు, ఇక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ఆయన అప్పట్లో ఆశించారు అంటారు. దాన్ని కూడా ఆయనకు ఇవ్వలేదు.
అలా టీడీపీలో గంటా సైలెంట్ గా ఉండడానికి కారణం అయ్యాయని అంటారు. వైసీపీలోకి వద్దామని ఒక దశలో గంటా ప్రయత్నాలు చేసినా కూడా ఆయనకు ఆ పార్టీ కూడా ఆశించిన విధంగా స్పందించలేదు అన్న ప్రచారం ఉంది. దాంతో గంటా శ్రీనివాసరావు తనకు తానుగానే స్ట్రాంగ్ లీడర్ గా మారేందుకు చూస్తున్నారు అంటున్నారు. గంటాకు రాజకీయాల్లోనే కాదు, పార్టీల ఏర్పాటులో కూడా అనుభవం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రా జిల్లాల వరకూ అంతా తానే అయి గంటా చూసుకున్నారు. అంతే కాదు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో తన వర్గాన్ని ఆయన బలంగా నాడు తయారు చేసుకున్నారు అని చెబుతారు. అలాంటి గంటా ఇపుడు కాపుల ఐక్యత మీద చేసిన కామెంట్స్ ని తేలిగ్గా తీసుకోలేమని అంటున్నారు.
గంటా కనుక ముందుకు వచ్చి నిలబడితే కాపులంతా ఒక శక్తిగా ఉంటారని కూడా చెబుతున్నారు. గంటా సైతం కాపులను ఏకీకృతం చేస్తామని, వారే రేపటి ఏపీ రాజకీయాలను శాసించేలా చేస్తామని అంటున్నారు. మొత్తానికి గంటా తీరు జోరు చూస్తూంటే ఆయన సొంతంగా ఏమైనా పార్టీని ఏర్పాటు చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో ఆయన ముఖ్యమంత్రి సీటు మీద మోజు పెంచుకున్నారా అన్న మాట కూడా వినిపిస్తోంది.
ఇక గంటా చంద్రబాబు జమానాలో ఉప ముఖ్యమంత్రి అవుదామని అనుకున్నారు. కానీ ఇపుడు ఏకంగా సీఎం సీటునే టార్గెట్ చేస్తున్నారా అంటే ఆలోచించాల్సిందే అన్న వారూ ఉన్నారు. అంగ బలం, అర్ధ బలం దండీగా ఉన్న గంటా లాంటి వారు ముందుకు వచ్చి కాపులను నడిపిస్తే ఏపీ రాజకీయాలు కీలకమైన మలుపు తిరగడం ఖాయమనే అంటున్నారు.