Begin typing your search above and press return to search.
జగన్ మనస్తత్వం గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్... ?
By: Tupaki Desk | 22 March 2022 7:30 AM GMTజగన్ గురించి జనాలకు తెలుసు. ఆయన పన్నెండేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. అదే టైం లో ఆయన పాదయాత్ర పేరిట బాగా తిరిగారు. దాంతో జనాలకు ఆయన మీద ఒక ఒపీనియన్ ఉంది. అయితే జగన్ అయినా ఏ నాయకుడు అయినా జనాల్లో ఉండేది ఒకలా ఉంటే వారు అసలు రియల్ గా ఎలా ఉంటారు అన్నది బయట ప్రపంచానికి పెద్దగా తెలిసే అవకాశం లేదు. దాని మీద రకరకాల ప్రచారాలు అయితే ఉంటాయి.
జగన్ విషయంలో అయిన ఆయనకు కోపం ఎక్కువని, తనకు నచ్చని విషయంలో ఆయన ఏ మాత్రం సహించరని ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా కొన్నేళ్ళుగా ప్రచారం చేస్తూ వచ్చింది. దాని మీద గత ఎన్నికల వేళ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జగన్ గురించి నానా రకాలైన ప్రచారం చేస్తారని, కానీ తన బిడ్డ ప్రజల దగ్గరకు వచ్చారని, వారితోనే నెలల తరబడి ఉంటున్నారని, మరి జగన్ ఏంటి అన్నది ప్రజలకు ఈ పాటికే తెలిసే ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఆ సంగతి అలా ఉంటే జగన్ గురించి టీడీపీ సీనియర్ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అయితే ఒక మీడియా ఛానల్ లో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ ని చేశారు. శాసనసభలో జగన్ తనకు నచ్చని విషయం ప్రస్థావనకు వస్తే చాలా అసహనంగా ఉంటారని పేర్కొన్నారు. నిజాలు చెబితే జగన్ అసలు తట్టుకోలేరని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
తాను గతంలో సన్న బియ్యం సరఫరా చౌక దుకాణాల్లో లేదని ఏకంగా సాక్ష్యాధారాలతోనే నిరూపించానని, అలాగే అనేక ప్రజా సమస్యలను ప్రస్థావించి ప్రభుత్వం కళ్ళు తెరిపించానని అన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ తోటి సభ్యుడిని అని కూడా చూడకుండా తన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం మైక్ కట్ చేయించడం, ఏకంగా ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతానని చెప్పడం వంటివి చేశారని గుర్తు చేసుకున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి సీట్లో ఉన్న వారు తొందరగా ఆగ్రహాన్ని ప్రదర్శించరని, కానీ జగన్ మాత్రం విపక్షం ప్రజా సమస్యలు ప్రస్థావిస్తే మాత్రం తట్టుకోలేరని రామానాయుడు అనడం విశేషం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం లో కల్తీసారా లో 20 మంది దాకా చనిపోతే సభలో ముఖ్యమంత్రి అవన్నీ సహజ మరణాలు అని అబద్ధాలే చెప్పారని ఆయన అన్నారు.
కానీ పోలీసులు మాత్రం కల్తీ సారా కాస్తున్న చాలా మందిని అరెస్ట్ చేసినట్లుగా అదే రోజు సాయంత్రం మీడియా ముందు చెప్పడం ద్వారా జగన్ అన్నది అబద్ధమని తేల్చేశారు అని రామానాయుడు గుర్తు చేసారు. ప్రజల ప్రాణాలను తేలికగా తీసుకునే ప్రభుత్వాన్ని తొలిసారిగా చూస్తున్నామని ఆయన మండిపడ్డారు.
ఇక జగన్ ఫోకస్ అంతా తన వ్యక్తిగత విషయాల మీదనే ఉంటుందని, ఆయన పాలనాపరమైన అంశాల మీద పూర్తి ఫోకస్ పెట్టరన్నదే తన అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి జగన్ తనకు సభలోపలా బయటా వ్యతిరేక గొంతు ఉండకూడదు అనుకుంటారని, అయితే తాను మాత్రం దేనికీ భయపడనని, తనను సభలో డ్రామానాయుడు అంటే జైలు రెడ్డి అని అనగల ధైర్యం ఉందని ఆయన అంటున్నారు.
ఇక తనకు సభలో మైక్ కట్ చేయాలని చూస్తే పులివెందుల వెళ్ళి తేల్చుకుంటానని, జగన్ అడ్డాగా పులివెందుల ఉన్నా కూడ తనకు భయమేమీ లేదని, తాను చెగువెరా స్పూర్తిలో రాజకీయాల్లోకి వచ్చానని, జీవితం మీద భయం కూడా లేదని రామానాయుడు సంచలన కామెంట్స్ చేశారు. మొత్తానికి జగన్ గురించి టీడీపీ మీడియా చేసిన ప్రచారం మాదిరిగానే రామానాయుడు కూడా తనదైన విశ్లేషణ వినిపించడం విశేషం.