Begin typing your search above and press return to search.
అఖిల దూకుడు మామూలుగా లేదుగా? ఇమేజ్ డ్యామేజ్ పట్టించుకోరా?
By: Tupaki Desk | 13 March 2022 6:30 AM GMTఘనమైన రాజకీయ వారసత్వం అందరికి సాధ్యం కాదు. ప్రజామద్దతుతో పాటు.. కంచుకోట లాంటి నియోజకవర్గం అన్ని రాజకీయ కుటుంబాలకు సాధ్యం కాదు. ఇలాంటి చోట తన వైఖరి కారణంగా తరచూ వివాదాల్లోకి వెళ్లటం కొందరు నేతలు చేస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు భూమా అఖిలప్రియ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరు విన్నంతనే భూమా కుటుంబం గుర్తుకు వస్తుంది. నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ అధిక్యత ఉండటమే కాదు.. తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి -శోభా నాగిరెడ్డి ఘన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో అఖిలప్రియ అదే పనిగా తప్పులు చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
తాజాగా తన తండ్రి నాగిరెడ్డి వర్థంతి సందర్భంగా అఖిల ప్రియ అనవసరంగా ఒక వివాదంలోకి వెళ్లారన్న విమర్శ వినిపిస్తోంది. బీజేపీనేత.. భూమా కుటుంబానికి చెందిన భూమా కిషోర్.. భూమానాగిరరెడ్డి.. శోభానాగిరెడ్డిల విగ్రహాల్ని తన సొంత స్థలంలో ఏర్పాటు చేశారు. దీని ఆవిష్కరణను ఘనంగా చేయాలనుకున్నకిశోర్ ఆలోచనలకు గండి కొడుతూ.. భూమా అఖిలప్రియ దూకుడుగా వ్యవమరిస్తూ.. విగ్రహాల్ని ఆవిష్కరించి.. వాటికి పాలాభిషేకం చేయటంతో మరో రగడకు తెర తీశారు.
అఖిలప్రియ చర్యపై భూమా కిశోర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలకు తనకు తెలీకుండా ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు. భూమా అఖిల ప్రియతో పాటు.. ఆమె సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి వచ్చి విగ్రహాల్ని ఆవిష్కరించారు. రాజకీయ అధిక్యత విషయంలో భూమా కుటుంబంలో అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. భూమా అఖిలప్రియ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమా నాగిరెడ్డి -శోభా నాగిరెడ్డి సంతానమైన అఖిల.. ఆ దంపతుల రాజకీయ వారసత్వంగా తెర మీదకు రావటం తెలిసిందే.
2014 ఎన్నికల వేళలో శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా మరణించగా.. తర్వాతి కాలంలో అస్వస్థతకు గురైన భూమా నాగిరెడ్డి సైతం కన్నుమూశారు. భూమా నాగిరెడ్డి అనూహ్య మరణంతో వారి రాజకీయ వారసురాలిగా భూమా అఖిల ప్రియ తెర మీదకు రావటం.. ఏపీ మంత్రిగా అవకాశాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా.. భూమా కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తిరుగులేని రీతిలో కొనసాగించే విషయంలో అఖిల ప్రియ తప్పులు చేశారన్న మాట వినిపిస్తోంది.
దీంతో.. రాజకీయ అధిక్యం కోసం తరచూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటుందని చెబుతున్నారు. తాజా వివాదాన్ని చూస్తే.. తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాల్ని అఖిల.. ఆమె సోదరుడు ఎలా ఆవిష్కరిస్తారన్న ప్రశ్న పాజిటివ్ గా మారితే.. అఖిలకు మాత్రం నెగిటివ్ అవుతోందన్న మాట వినిపిస్తోంది. తన చేతలతో తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్న భూమా అఖిల ప్రియ తీరును పలువురు తప్ప పడుతున్నారు.