Begin typing your search above and press return to search.

అమరావతి సరికొత్త నినాదం

By:  Tupaki Desk   |   5 March 2022 5:59 AM GMT
అమరావతి సరికొత్త నినాదం
X
రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పుతో అమరావతి జేఏసీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం అమరావతిపై చేస్తున్న నినాదాన్ని మార్చేశారు. ఇంతకాలం ‘సేవ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని నినాదాలు చేసేవారు. అయితే ఇక నుండి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్..బిల్డ్ అమరావతి’ అనే సరికొత్త నినాదాన్ని వినిపించాలని డిసైడ్ చేశారు. అంతేకాంకుండా ఇకనుండి కొత్త నినాదంతోనే జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తేవాలని కూడా అనుకున్నారు.

కోర్పు తీర్పిచ్చినంత మాత్రాన జగన్ అమలు చేస్తారని అమరావతి జేఏసీ నేతలు ఎవరు అనుకోవటంలేదు. అందుకనే తీర్పు అమల్లో భాగంగా జగన్ నిర్మాణ పనులు, ప్లాటింగ్ ప్రక్రియను ప్రారంభించేంతవరకు తమ ఆందోళనను కంటిన్యు చేయాలని కూడా డిసైడ్ చేశారు. నిజానికి హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేయటం సాధ్యంకాదని అందరికీ తెలిసిందే.

రెండు బెడ్రూముల ఇల్లు కట్టకోవాలంటేనే కనీసం ఏడాది పడుతుంది. అలాంటిది రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు డెవలప్ ఇచ్చేయటం, ఆరుమాసాల్లో రాజధాని నగరాన్ని నిర్మించేయటం జరిగే పనికాదు. ఈ విషయం బహుశా కోర్టుకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంత గట్టిగా ఆదేశాలు ఇవ్వకపోతే ప్రభుత్వం పనులు మొదలుపెట్టదని అనుకుని ఉంటుంది. అయితే కోర్టు ఆదేశాలను జగన్ ఏమేరకు అమలు చేస్తారన్నదే ఇక్కడ ఆసక్తిగా మారింది.

పార్టీవర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం ముందు రెండుదారులున్నాయట. మొదటిదేమో హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టులో అప్పీలుకు వెళ్ళటం. రెండోదారేమో పనులు మొదలుపెట్టడం. రెండోది చేయటం జగన్ కు సుతారం ఇష్టంలేదు. కాబట్టి మొదటిదానికే ఛాన్సుంది. అయితే పార్టీ వర్గాలు ఇక్కడే మరోటి కూడా చెబుతున్నారు. అదేమిటంటే హైకోర్టు తీర్పును లైట్ గా తీసుకోవటం. నిజానికి సుప్రింకోర్టులో అప్పీలు చేస్తే హైకోర్టు తీర్పుకు సవరణలు వచ్చే అవకాశముందని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఏమి చేస్తారు ? అమరావతి జేఏసీ కొత్త నినాదం ప్రభుత్వంపై ఎంతవరకు ఒత్తిడి తెస్తుందనేది చూడాల్సిందే.