Begin typing your search above and press return to search.
తగ్గుతున్న కరోనా జోరు .. భారీగా తగ్గిన కేసులు
By: Tupaki Desk | 10 Aug 2021 6:49 AM GMTమన దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ తగ్గుతూ వస్తుంది. సెకండ్ వేవ్ పిక్స్ సమయంలో దాదాపుగా రోజుకి ఐదు లక్షల పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి దేశంలో తగ్గుముఖం పట్టింది. కరోనా వైరస్ కేసుల నమోదు సంఖ్య తగ్గుతున్నా కరోనా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడడంతో లేదు. తాజాగా 30 వేలకు దిగువగా కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 373 మంది వైరస్‌తో బాధపడుతూ మృతిచెందారు.
తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో కలిపి , దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,98,158కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 373 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీనితో మృతుల సంఖ్య మొత్తం 4,28,682కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,80,968 మంది కోలుకున్నారు. 3,88,508 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 51,45,00,268 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్రకటించారు. రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది.
దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.11 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. కొత్త కేసులు వరుసగా నాలుగో రోజు 40వేల కంటే తక్కువ వచ్చాయి. అలాగే యాక్టివ్ కేసులు 13 రోజుల తర్వాత 4 లక్షల కంటే తక్కువకు చేరాయి. అలాగే యాక్టివ్ కేసులు 139 రోజుల కిందట ఎంత తక్కువగా ఉండేవో ఇప్పుడు అంత తక్కువకు చేరాయి. కొత్త మరణాలు 132 రోజుల్లో ఈ రోజే తక్కువగా వచ్చాయి. అలాగే 132 రోజుల్లో మొదటిసారి 400 కంటే తక్కువ వచ్చాయి. నిన్న కేరళలో అత్యధికంగా 13.05వేల కొత్త కేసులు రాగా ,మహారాష్ట్రలో 4.5వేలు, తమిళనాడులో 1.9వేలు వచ్చాయి. కేరళలో కొత్త మరణాలు 105 రాగా మహారాష్ట్రలో 68, ఒడిశాలో 66 వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని 9 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.
ప్రపంచదేశాల్లో నిన్న కొత్తగా 5,04,606 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20.40 కోట్లు దాటింది. కొత్తగా 7,661 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 43.15 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.65 కోట్లు ఉన్నాయి. ఇవి మెల్లగా పెరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా 88,866 కేసులు, 285 మరణాలు వచ్చాయి. బ్రెజిల్‌లో నిన్న 12,085 కొత్త కేసులు, 92 మరణాలు సంభవించాయి