Begin typing your search above and press return to search.

తెలుగు నేల మీద రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తినోళ్లు అంతమంది ఉన్నారట

By:  Tupaki Desk   |   22 Sep 2022 4:22 AM GMT
తెలుగు నేల మీద రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తినోళ్లు అంతమంది ఉన్నారట
X
గతానికి మించి గడిచిన కొన్నేళ్లుగా తెలుగు నేల మీద నివసించే సంపన్నుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సంపన్నుల వివరాల్ని తెలియజేస్తూ నివేదిక ఒకటి విడుదలైంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. రూ.వెయ్యి కోట్లకు పైనే ఆస్తి పాస్తులు ఉన్న కుబేరులు ఏకంగా 78 మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఈ 78 మంది అపర సంపన్నుల ఆస్తి మొత్తం కలిపితే.. రూ.3.90 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తేల్చారు. గత ఏడాదితో పోలిస్తే వీరి ఆస్తి 3 శాతం పెరిగినట్లుగా గుర్తించారు. ఈ సంపన్నుల్లో అత్యధికులు ఫార్మా రంగానికి చెందిన వారు కావటం గమనార్హం. ఫార్మా తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్.. నిర్మాణ రంగాలకు చెందిన వారు ఉన్నారు.

తెలుగోళ్లలో తోపు సంపన్నుడిగా దివీస్ లేబొరేటరీస్ అధిపతి మురళి కె. దివి నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.56,200 కోట్లుగా తేల్చారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న కుటుంబంగా తేల్చారు. ఫార్మా కంపెనీని నిర్వహిస్తున్న ఆయన గడిచిన కొంతకాలంగా అత్యంత సంపన్నుడిగా నిలుస్తున్నారు. మురళి. కె. దివి తర్వాత రెండో స్థానంలోనిలిచారు హెటెరో ల్యాబ్స్ కు చెందిన బి. పార్థసారధి రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.

వారి కుటుంబ ఆస్తి మొత్తం రూ.39,200కోట్లుగా తేల్చారు.తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత సంపన్న మహిళగా మహిమా దాట్ల నిలిచారు. ఆమె ఆస్తి మొత్తం రూ.8700 కోట్లుగా గా చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులైన వారిలో 82 శాతం మంది అంటే.. 64 మంది హైదరాబాద్ కు చెందిన వారు కాగా.. విశాఖ పట్నం నుంచి ఐదుగురు.. రంగారెడ్డి జిల్లా నుంచి మరో ముగ్గురు ఉన్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్తగా పదకొండు మంది ఈ జాబితాలో నిలిచారు. 11 ఏళ్ల క్రితం అత్యంత సంపన్నుల జాబితాలో ఉమ్మడి రాష్ట్రంలోని ముగ్గురు సంపన్నులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏకంగా 78 మందికి పెరగటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 సంపన్నులు వీరే

పేరు వ్యాపార సంస్థ సంపద (రూ.కోట్లల్లో)
మురళి కె. దివి, ఫ్యామిలీ దివీస్ లేబొరేటరీస్ 56,200
బి. పార్థసారధిరెడ్డి.. ఫ్యామిలీ హెటెరో ట్యాబ్స్ 39,200
సత్యనారాయణ రెడ్డి.. ఫ్యామిలీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ 16,000
జి. అమరేందర్ రెడ్డి, ఫ్యామిలీ జీఏఆర్ 15,000
జూపల్లి రామేశ్వరరావు, ప్యామిలీ హైహోం ఇండస్ట్రీ 13,300
పి. పిచ్చిరెడ్డి మేఘా ఇంజినీరింగ్ 12,600
పీవీ క్రిష్ణా రెడ్డి మేఘా ఇంజినీరింగ్ 12,100
కె. సతీష్ రెడ్డి, ఫ్యామిలీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 11,300
వెంకటేశ్వర్లు జాస్తి, ఫ్యామిలీ సువెన్ ఫార్మా 9,000
మహిమా దాట్ల, ఫ్యామిలీ బయొలాజికల్ ఇ. లిమిటెడ్ 8,700
ఈ ఏడాది కొత్తగా జాబితాలో చేరిన తెలుగు సంపన్నులు
పేరు కంపెనీ పేరు సంపద (రూ.కోట్లల్లో)
అయోధ్య రామిరెడ్డి రాంకీ గ్రూపు 7,400
రమేష్ కంచర్ల రెయిన్ బో హాస్పిటల్స్ 2,900
క్రిష్ణమూర్తి చెరుకూరి, ఫ్యామిలీ విష్ణుకెమికల్స్ 1,900
శ్రీనివాస్ నామాల, ఫ్యామిలీ పోరస్ లేబొరేటరీస్ 1,800
నందన్ రెడ్డి స్విగ్గీ 1,600


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.