Begin typing your search above and press return to search.

డ్రంకెన్ డ్రైవ్లో దొరికి.. కేసు చిక్కుముడులతో ఉన్నారా? సొల్యూషన్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   1 March 2022 3:32 AM GMT
డ్రంకెన్ డ్రైవ్లో దొరికి.. కేసు చిక్కుముడులతో ఉన్నారా? సొల్యూషన్ వచ్చేసింది
X
ఎవరెన్ని చెప్పినా.. ఫుల్ గా తాగేసి.. నిబంధనలకు విరుద్ధంగా రయ్ మంటూ బండి మీద దూసుకెళ్లే మందుబాబులకు తెలంగాణ పోలీసులు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ లు పట్టుబడేలా చేయటమే కాదు.. ఎందుకు తాగామా? అన్న భావన కలిగేలా కోర్టులు.. కేసులు.. జరిమానాలు.. జైళ్లతో ఠారెత్తిపోతున్నోళ్లు ఎందరో. తాగి బండి నడిపినప్పుడు లేని సమస్యలన్ని.. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన తర్వాత బయటకురావటం తెలిసిందే. భారీ జరిమానాతో పాటు.. అప్పటివరకు నడిపిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవటం తెలిసిందే.

ఇప్పటివరకు అమలు చేస్తున్న విధివిధానాల ప్రకారం చూస్తే.. మోతాదుకు మించి తాగేసి వాహనాన్ని నడిపే వారికి రూ.10,500 ఫైన్ తో పాటు.. కౌన్సెలింగ్ తప్పనిసరి చేశారు. దీంతో.. చాలామంది తమకు విధించే ఫైన్ నుంచి.. కౌన్సెలింగ్ నుంచి తప్పించుకోవటానికి వీలుగా.. పోలీసులకు అప్పగించిన బైక్ సంగతి వదిలేసి.. ప్రత్యమ్నాయాల్ని చూసుకుంటున్నారు. గడిచిన రెండేళ్లలో (2019-2021) వరకు దాదాపు 5776 బైకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రికార్డుల్లో కేసుల సంఖ్య పెరిగిపోవటం.. పోలీస్ స్టేషన్లలో వందలాది బైకులు దుమ్ము కొట్టుకుపోయి.. చెడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు ల భారాన్ని భారీగా తగ్గించేందుకు తెలంగాణ పోలీసులు ఇప్పుడు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తాగి వాహనాన్ని నడిపిన వారికి మరో అవకాశాన్ని ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న భారీ ఫైన్ ను కట్టలేని పరిస్థితులు ఉండటంతో.. ఆ ఫైన్ ను తగ్గించేస్తూ నిర్ణయం తీసుకన్నారు.

తాజాగా తీసుకొచ్చిన అవకాశం ప్రకారం చూస్తే.. తాము తాగి వాహనం నడిపినట్లుగా ఒప్పుకొని.. రూ.2100 మొత్తాన్ని ఫైన్ రూపంలో కట్టేసి కేసు నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. అయితే.. దీనికో లెక్క పెట్టారు. అదేమంటే.. తాగి వాహనాన్ని నడిపి పట్టుబట్టిన సమయంలో.. వారు తాగిన మద్యం మోతాదును నమోదు చేశారు. దీని ఆధారంగా తాజాగా ఫైన్లను డిసైడ్ చేశారు. దాని ప్రకారం చూస్తే..

36 -100 బీఏసీ ఉంటే రూ.2100

100 - 200 మధ్య బీఏసీ ఉంటే రూ.3100

200 - 300 మధ్య బీఏసీ ఉంటే రూ.4100

ఈ విధానంలో చలానాను కట్టించుకోవటంత్ పాటు.. వాహనదారుడు తాను మద్యం తాగి వాహనాన్ని నడిపినట్లుగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. త్వరలో నిర్వహించే లోక్ అదాలత్ లో ఈ డ్రంకెన్ డ్రైవ్ కేసుల్ని పరిష్కరించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. మద్యం తాగి వాహనాల్ని నడిపే టూవీలర్లు.. ఆటోలు.. కార్లు.. ఇతర వాహన దారులకు కూడా ఇదే తీరులో తమ కేసుల్ని పరిష్కరించే అవకాశాన్ని తెలంగాణ పోలీసులు ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. మరోసారి మద్యాన్ని తాగి వాహనం మాత్రం నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయంలో మాత్రం ఎలాంటి తప్పు చేయొద్దు.