Begin typing your search above and press return to search.
ఆర్యన్ ఖాన్ విషయంలో ఎన్సీబీ ఫెయిల్ అయినట్టేనా?
By: Tupaki Desk | 29 March 2022 7:30 AM GMTపోయిన ఏడాది అంతా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించే వార్తలు గుప్పుమన్నాయి. ఈ స్టార్ హీరో కుమారుడు డ్రగ్స్ కేసులో దొరికి అరెస్ట్ కావడం.. ఎన్సీబీ పట్టుదలగా అతడి నేరాన్ని నిరూపించడానికి కంకణం కట్టుకొని పనిచేయడం వైరల్ అయ్యింది. ఆర్యన్ ఖాన్ తన సన్నిహితులతో కలిసి డ్రగ్స్ వాడారనే వార్తలు మొదట వచ్చాయి. ఆ తర్వాత ఆర్యన్ వద్ద డ్రగ్స్ పట్టుబడలేదని.. అతడితోపాటు మరొక యువకుడి వద్ద కొన్ని గ్రాముల మేరకు డ్రగ్స్ వాడినట్టు ఎన్సీబీ తన అభియోగాల్లో పేర్కొంది.
ఎన్సీబీ పట్టుదలకు పోవడంతో ఈ కేసులో ఆర్యన్ ఖాన్ దాదాపు 25 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇక తన కుమారుడిని విడిపించుకోవడానికి పలు మార్లు షారుఖ్ ఖాన్ కోర్టును ఆశ్రయించినా బెయిల్ మాత్రం దొరకలేదు. చివరకు 25 రోజుల తర్వాత ఆర్యన్ జైలునుంచి బెయిల్ పై విడుదలయ్యాడు.
ఆర్యన్ ఖాన్ ను విడుదల కాకుండా జైల్లోనే ఉంచడానికి అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ చేయని ప్రయత్నం లేదు. బోలెడంత సమాచారం ఉందని అతడిని విడుదల చేయవద్దని నాడు ఎన్సీబీ బెయిల్ రాకుండా గట్టిగా అడ్డుకుంది. ఆర్యన్ ఖాన్ నేరం గురించి ఆధారాలు పక్కాగా ఉన్నాయని వాదించింది. ఈ కేసులో ఆర్యన్ పలువురితో డ్రగ్స్ గురించి సంభాషించినట్టుగా మీడియాకు లీకులు వచ్చాయి. బాలీవుడ్ నటి అనన్య పాండే కూడా షారుఖ్ తనయుడికి డ్రగ్స్ ఆఫర్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అనన్యను కూడా ఎన్సీబీ అధికారులు ఒక పూట విచారించారు. ఆ తర్వాత వీరి పాత్ర గురించి ఎన్సీబీ ఏం తేల్చిందో ఏమో కానీ ఇప్పుడు చార్జీషీట్ దాఖలు చేయడానికి కూడా 90 రోజుల సమయం కోరడం సంచలనమైంది.
ఆర్యన్ ఖాన్ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయన్న ఎన్సీబీ ఇప్పుడు ఏకంగా మూడు నెలల సమయాన్ని కోరడం సలచంనమైంది. ఇంకో 90 రోజుల గడిస్తే కానీ తాము చార్జిషీట్ దాఖలు చేయలేమని కోర్టుకు నివేదించింది ఎన్సీబీ.
ఇప్పటికే కొన్ని నెలలు గడిచిపోయిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఎందుకు ఎన్సీబీ అధికారులు ఆధారాలు సాధించలేదన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఆర్యన్ ఖాన్ ను 25 రోజుల పాటు విచారించిన తర్వాత కూడా నెలలు గడిచినా ఈ కేసులో ఎన్సీబీ పురోగతి సాధించేకోపోవడం ఏంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇంతకీ ఈ కేసు గుట్టు ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది.