Begin typing your search above and press return to search.
పగడపు ఉంగరం... పవన్ ఇక సీఎం ...?
By: Tupaki Desk | 16 March 2022 3:28 AM GMTపవన్ కళ్యాణ్ సినీ హీరో కమ్ పొలిటీషియన్. ఆయన చరిష్మాకు తిరుగు లేదు. లేటెస్ట్ గా జరిగిన జనసేన ఎనిమిదవ ఆవిర్భావ సభ పవన్ స్టామినా ఏంటో రుజువు చేసింది. పవన్ సీఎం అన్న నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈసారి చాలా జాగ్రత్తగా ఆచీ తూచీ మాట్లాడారు. గంటన్నర పాటు చేసిన స్పీచ్ లో ఒక్కో అంశాన్ని టచ్ చేస్తూ చెప్పాల్సినది అంతా వివరంగా జనాలకు చెప్పుకొచ్చారు.
ఒక విధంగా పవన్ 2024 యుద్ధానికి రెడీ అన్నట్లుగానే ఈ సభ జరిగింది. ఇదిలా ఉండగా ఈ సభకు వచ్చిన పవన్ డ్రెస్ కోడ్ మార్చారు. నిజానికి రాజకీయ సభలకు పవన్ జుబ్బా పైజామా వేసుకుని రావడం చాలా కాలంగా జరుగుతోంది. కానీ ఈసారి సభలో మాత్రం పవన్ నీలి రంగ్ షర్ట్ తో పాటు, బూడిద రంగు ప్యాంట్ ధరించారు.
రాజకీయ సభలో పవన్ డ్రెస్ కోడ్ మీద కూడా చర్చ జరిగింది. ఇక వీటికి మించి మరోటి కూడా ఇపుడు కీలక చర్చకు తావిస్తోంది. పవన్ ఈ సభలో నమస్కారం చేస్తున్నపుడు ఆయన కుడి చేతిలో ఉంగరం వేలుకు పగడపు ఉంగరాన్ని ధరించారు. ఇది అందరికీ ఆకట్టుకుంది.
పగడపు ఉంగరంతో పవన్ ఇంతకు ముందు ఎపుడూ కనిపించలేదు. నిజానికి ఆయన ఏ సభకు వచ్చినా ఒంటి మీద బంగారు ఆభరణాలు అయితే ఉండవు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. అలాంటి పవన్ కి పగడపు ఉంగరం మీద మోజు ఎందుకు పుట్టింది అన్నది చర్చగా ఉంది.
అయితే ఈ పగడపు ఉంగరం వెనక ఒక కధ ఉందని ప్రచారం సాగుతోంది. పవన్ జాతకం ప్రకారం పగడపు ఉంగరం ధరిస్తే ఆయన రాజకీయ జీవితం బ్రహ్మాండంగా వెలిగిపోతుందని జ్యోతిష్య పండితులు ఇచ్చిన సూచనలతోనే పవన్ ఇలా పగడాన్ని ధరించారు అని అంటున్నారు.
నిజానికి గత కొన్నాళ్ళుగా జనసేన మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఇపుడు ఏపీలో కూడా కీలకంగా మారుతోంది. ఏపీలో కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా జనసేన అన్న మాట అయితే విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న నేపధ్యంలో పవన్ పగడపు ఉంగరాన్ని ధరించడం అంటే ఆయనే కాబోయే సీఎం అని అంతా అంటున్నారు. నిజానికి ఇది సెంటిమెంట్. అయినా ఇలాంటివి రాజకీయాల్లో చాలా మందికి ఉన్నాయి.
జాతకాన్ని మలుపు తిప్పే ఇలాంటి వాటిని గతంలో కూడా చాలా మంది ధరించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పవన్ సైతం అదే రూట్ లో పగడాన్ని ధరించారు. ఇక ఆయన కూర్చోబోయేది కచ్చితంగా సీఎం సీట్లోనే అని అంతా అంటున్నారు. జన సైనికులు అయితే పవన్ సీఎం అని గట్టిగానే నినాదాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ పగడం పవన్ జాతకాన్ని ఏ మలుపు తిప్పుతుందో.