Begin typing your search above and press return to search.

అచ్చెన్న సైలెంట్ ష్! గ‌ప్ చుప్

By:  Tupaki Desk   |   22 Feb 2022 6:34 AM GMT
అచ్చెన్న సైలెంట్ ష్! గ‌ప్ చుప్
X
శ్రీ‌కాకుళం రాజ‌కీయాల్లో కింజ‌రాపు కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది.ఆ మాట‌కు వ‌స్తే ఉమ్మ‌డి ఆంధ్ర‌లోనూ,అవ‌శేషాంధ్ర‌లోనూ ఆ కుటుంబానికి అన్ని పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు.పార్టీల‌కు అతీతంగా ఆ రోజు ఎర్ర‌న్నాయుడు ఎదిగారు.కొంద‌రికి సింహ స్వ‌ప్నం అయ్యారు.మంచి నాయ‌కుడిగా పేరుతెచ్చుకున్నారు.అధిష్టానానికి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా దేశ రాజ‌కీయాల్లో కూడా టీడీపీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పారు.ఓడినా,గెలిచినా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటాను అని అన్నారు. ఉన్నారు కూడా!

ఫిబ్ర‌వ‌రి 23న ఆయ‌న జ‌యంతి.ఏటా మాదిరిగానే ఆయ‌న స్మ‌ర‌ణ‌కు వ‌స్తారు.ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు,త‌రువాత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ‌కు స‌హాయ మంత్రిగా ప‌నిచేసిన‌ప్పుడు అన్నింటి క‌న్నా ముఖ్యంగా ధ‌ర్మాన (అప్ప‌టి రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు) కుటుంబంపై పోరాడిన‌ప్పుడు,క‌న్నెధార లీజుకు సంబంధించిన వ్య‌వ‌హారంలో ఓ పెద్ద పత్రిక‌తో క‌లిసి అలుపెరుగని పోరాటం చేసిన‌ప్పుడు నాయుడు గారు తిరుగులేని నేత అని అంతా అనే విధంగా చేసుకున్నారు.ఆ రోజు రాజ‌శేఖర్ రెడ్డి కుటుంబంపై కూడా పోరాటం చేశారు.

ఆ స్థాయిలో ఇవాళ ఇష్యూస్ ఉన్నా కూడా అచ్చెన్న మాట్లాడ‌డం లేదు.వీరు ఆయ‌న సోద‌రులు. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభాగ రాష్ట్ర అధ్య‌క్షులు,టెక్క‌లి ఎమ్మెల్యే.మొద‌ట్లో జ‌గ‌న్ పై మాట‌ల దాడి చేసినా త‌రువాత ఎందుక‌నో ఆ జోరు త‌గ్గిపోయింది. వైసీపీ కూడా అదే ప‌నిగా శాస‌న స‌భ లోప‌ల‌,బ‌య‌ట కూడా బాడీ షేమింగ్ కు పాల్ప‌డ‌డంతో ఓ సంద‌ర్భంలో తీవ్రంగా నొచ్చుకున్నారు.ఓ సంద‌ర్భంలో ప్రివిలైజ్ క‌మిటీ ఎదుట హాజ‌ర‌య్యారు కూడా! స‌భా హక్కుల ఉల్లంఘ‌న‌పై వివ‌ర‌ణ కూడా ఇచ్చారు.

కానీ త‌రువాత క్ర‌మంలో ఆయ‌న పెద్ద‌గా మాట్లాడింది లేదు.ముఖ్యంగా శ్రీ‌కాకుళం జెడ్పీలో కారుణ్య నియామ‌కాలకు సంబంధించి కొంత అవినీతి జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నా వాటిపై మాట్లాడ లేదు.అదేవిధంగా సార‌వ‌కోట మండ‌లం (డిప్యూటీ సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌రస‌న్న‌పేట‌) లో గ్రానైట్ తవ్వ‌కాల‌ను అడ్డుకునేందుకూ ప్ర‌య‌త్నించ‌లేదు.

అదేవిధంగా ఇప్పుడు పాల‌కొండ జిల్లా సాధ‌న కు సంబంధించి టీడీపీ స్టాండ్ ఏంట‌న్న‌ది చెప్ప‌డం లేదు.కనీస స్థాయిలో కూడాఏ ఉద్య‌మం కూడా ఇంత‌వ‌ర‌కూ నిర్వ‌హించ‌లేదు.ఇదే స‌మ‌యంలో ఎర్ర‌న్న‌తో త‌ప్ప‌క అచ్చెన్న‌ను పోల్చాలి.ఓ అధికారికి నివేదిక ఇవ్వాల‌న్నా,విన‌తి పత్రం ఇవ్వాల‌న్నా సంబంధిత అంశంపై పూర్తి వివ‌రాలు సేక‌రించి వెళ్లి, పోరాడేవారు.

అలా అని ఆయ‌న బూతులు మాట్లాడే నాయ‌కుడు అయితే కాదు.అదుపు త‌ప్పి కోపంతో ఊగిపోయిన నేత కూడా కాదు.అన్న‌య్య‌లానే అచ్చెన్న కూడా మంచి పేరు తెచ్చుకోద‌గ్గ నేతగా ఎద‌గాల్సిన వ్య‌క్తే కానీ ఎందుక‌నో కొంత వెనుకంజ వేస్తున్నారు.గ‌తంలో వైసీపీ స‌ర్కారు ఈఎస్ఐ మందుల కుంభ‌కోణంలో అక్ర‌మాలు అంటూ కార్మిక శాఖ మంత్రి గా ఉన్న‌ప్పుడు అచ్చెన్న అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ హ‌డావిడి చేసింది.

దీంతో వీటిని నిరూపించాల‌ని,నిరూపిస్తే త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని కూడా వ‌దులుకునేందుకు సిద్ధమేన‌ని ప్రక‌టించి సంచ‌ల‌నం రేపారు.కొన్ని విష‌యాల్లో అన్న‌ను పోలి న‌డుచుకున్నా,కొన్నివిష‌యాల్లో మాత్రం కొంత వ‌ర‌కూ ఆయ‌న‌కు ఆవేశ‌మే కొన్ని అన‌ర్థాల‌కు అపార్థాల‌కు దారి ఇచ్చింది.

అధికారుల‌పై ఆ రోజు తీవ్ర ఒత్తిడి ఉంచేవార‌న్న విమ‌ర్శ‌నూ ఎదుర్కొన్నారు.ఇవి మిన‌హాయిస్తే అచ్చెన్న కు ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో మంచి ప‌ట్టు ఉంది.నాయుడి గారి త‌మ్ముడిగా మంచి గుర్తింపు ఉంది.సొంత కొడుకు క‌న్నా ఎక్కువ‌గా ఎంపీ రామూను చూసుకుంటార‌న్న పేరుంది.అన్న‌కుటుంబాన్ని కంటికి రెప్ప‌లా కాపాడ‌తార‌న్న మంచి గుర్తింపు ఉంది.

అదేవిధంగా రామూ సోద‌రి, రాజ‌మండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వానీని ఆ న‌లుగురు అన్న‌ద‌మ్ములూ ఎంతో గారాబంగా చూసుకుంటారు అన్న పేరు కూడా ఉంది.కానీ రాజ‌కీయంగా చూసుకుంటే ఇవాళ అచ్చెన్న అనుకున్నంత వేగంగా ప‌నిచేయ‌లేక‌పోతున్నార‌న్న విమర్శ మాత్రం బ‌లీయంగా వినిపిస్తోంది.త్వర‌లో కుమారుడు కృష్ణ మోహ‌న్ నాయుడు అరంగేట్ర చేయ‌నున్నారు.ఈ ద‌శ‌లో మ‌ళ్లీ అచ్చెన్న ప్ర‌జా పోరాటాలు ఉద్ధృతం చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది.