Begin typing your search above and press return to search.

అంతరించిపోతున్న అమెజాన్ అడవులు... చర్యలు చేపట్టకపోతే మనుగడ కష్టమే...!

By:  Tupaki Desk   |   16 March 2022 3:28 AM GMT
అంతరించిపోతున్న అమెజాన్ అడవులు... చర్యలు చేపట్టకపోతే మనుగడ కష్టమే...!
X
ప్రపంచ పర్యావరణానికి మరో ముప్పు వాటిల్లనుందా అని అంటే అవును అనే మాటే నిపుణుల నుంచి వినిపిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద అడవుల్లో ఒకటి అయిన అమెజాన్ కొంతమంది మానవులు చేసే తప్పులతో రోజు రోజుకు దాని కళను కోల్పోతుంది. ఇదే విషాయన్ని కొన్ని సంస్థలు వెల్లడించాయి. ఈ అడువుల పై పరిశోధనలు చేసిన కొన్ని అత్యున్నత సంస్థలు రానున్న రోజుల్లో అమెజాన్ అడవులకు ముప్పు ఉందని చెప్తున్నారు.

కేవలం మానవులు చేసిన కొన్ని తప్పిదాల కారణంగా ఆ సుందర విశామైన అడువులు వాటి ప్రత్యేకతలను కోల్పోతున్నాయని వివిధ పరిశోధనలు చెప్తున్నాయి. రానున్న రోజుల్లో అమెజాన్ అడువులు కేవలం గడ్డి మైదానాలుగా మిగిలిపోతాయని నిపుణులు అంచానా వేస్తున్నారు. ఇదే జరిగితే ఆ ప్రభావం ప్రపంచం అంతటి మీదా పడుతుందని చెప్తున్నారు.

ప్రపంచ కాలుష్యా నివారణలో అమెజాన్ అడువులది చాలా కీలక పాత్ర. పెద్ద ఎత్తున ఉండే ఈ అమెజాన్‌ అడువులు పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. అయితే అడవులును కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నరికివేస్తున్నారు. దీంతో కార్బన్‌డైఆక్సైడ్‌ అనేది గాలిలో పెరిగి పోతుంది. సాధారణంగా ఉండాల్సి కార్బన్ డై ఆక్సైడ్ కంటే ఇది ఎక్కువ అయితే లేని అనర్ధాలకు అది దారి తీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ అడువుల నరకి వేత ప్రక్రియ అనేది గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందని... అందుకు శాటిలైట్ చిత్రాలే రుజువు అని అంటున్నారు.

ఇటీవల అమెజాన్ అడువుల ప్రభావం ప్రపంచ మానవాలిపై ఎలా ఉంటుంది అనే దానిపై నేచర్‌ క్లైమెట్‌ ఛేంజ్‌లో పరిశోధకులు పరిశోధనలు చేశారు. అయితే వీరు చేసిన అధ్యయనంలో తేలింది ఏమిటి అంటే.. అడవుల నరికి వేత వల్ల అమెజాన్ తిరిగి తన పూర్వ వైభవం కోల్పోతుందని అర్ధం అయ్యింది. ఇదిలా ఇలానే కొనసాగితే కచ్చితంగా మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే బ్రెజిల్ లో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ అడువులను కొద్దిగా నరికి వేస్తున్నట్లు చెప్తున్నారు. దీని వల్ల మరి కాలుష్యం పెరిగి పోతున్నట్లు చెప్తన్నారు.

అమెజాన్ అడవులకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అడువులు సుమారు తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు యాభై లక్షల చదరపు కిమీ అని తెలిసిన వారు చెప్తారు. కానీ దురదృష్టవశాత్తూ.. ఈ అడవులల్లో సుమారు 75 శాతం వరకు ఆక్రమణకు గురైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఆక్రమణ అనేది కొత్తగా పుట్టుకుని వచ్చింది కాదు. సుమారు యాబై ఏళ్లకు పైగా మనిషి తన స్వప్రయోజనాల కోసం ఈ అడవులను బలి చేస్తున్నాడు. దీని నుంచి వచ్చే బయో ఇంధనం, కలప కారణంగా నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు అనే భావనతో మనిషి తన ఇష్టా రాజ్యంగా అడవులను ఆక్రమిస్తున్నాడు. ఈ అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేస్తున్నారు కొందరు గిరిజనులు. దీని వల్ల సుమారు 20 శాతం అడవి తన రూపాన్ని మార్చుకుంది.

అత్యంత పురాతన అయిన ఈ అమెజాన్ అడువుల్లో సుమారు మూడు వేల మూడే వందలకు పైగా గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి ఈ అడవే అన్నీ. అంతేకాకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీనిపై ఆధారపడి బతుకుతున్న వారి సంఖ్య మూడు కోట్లకు పైగా ఉంది. ఈ అడువుల్లో సుమారు 25 లక్షలకు పైగా కీటకాలు ఉన్నాయని జీవ పరిశోధకులు అంచనా. ఇంతటి ముఖ్యమైన అమెజాన్ అడువులను స్వలాభాల కోసం కొందరు నరికి వేస్తున్నారు. దీంతో భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతోంది.