Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీలో 'చిడత' భజన!
By: Tupaki Desk | 23 March 2022 7:39 AM GMTఔను! ఏపీ అసెంబ్లీలో ఈ రోజు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు చిడతలు తెచ్చి.. భజన చేశారు. కొందరు పద్యాలు పాడారు. ఇంకొందరు స్లోగన్లు చేశారు. మరికొందరు భీమ్లానాయక్ పాట కూడాపాడారు. ఎవరు ఏం చేసినా.. చిడతలు.. చెక్క భజన చేయడం గమనార్హం. కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కల్తీ సారా అంశంపై ప్రతిపక్షం, అధికార పక్షాల మధ్య తీవ్ర యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షం టీడీపీ సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల తొలి రోజు నుంచే టీడీపీ వ్యవహారం.. దుమారానికి దారితీసింది. గవర్నర్ ప్రసంగిస్తు న్న సమయంలోనే ఆయన ప్రసంగ కాపీలను చింపేసి.. గవర్నర్ పై విసిరారు. ఆ తర్వాత.. బడ్జెట్ ప్రసంగం రోజు కూడా.. ఆయా ప్రతులను చింపేసి గందరగోళం సృష్టించారు. మరుసటి రోజు.. ఏకంగా స్పీకర్‌పై పేపర్లు చింపి పోశారు.. ఇక, అప్పటి నుంచి టీడీపీ సభ్యులు.. రోజు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇక, మంగళవారం.. ఏకంగా విజిల్స్ తీసుకువచ్చి.. సభలో గందరగోళం సృష్టించారు. చప్పట్లు చరుస్తూ.. విజిల్స్ మోగిస్తూ.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.
తాజాగా ఇప్పుడు బుధవారం .. ఏకంగా..అసెంబ్లీ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. సభలోకి చిడతలు తీసుకువ చ్చారు. అంతేకాదు.. శోకణ్నాలు పెడుతూ... పాటలు పాడుతూ.. పద్యాలు పాడుతూ.. వాటిని వాయించారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి.. దానిపైనే చరుస్తూ.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభాపతి తమ్మినేని సీతారాం.. టీడీపీ సభ్యులకు చాలా వరకునచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ.. వారు మాత్రం వినిపించుకోకపోవడం గమనార్హం.
సారా మరణాలపై చర్చించాలని.. టీడీపీ సభ్యులు కోరుతున్నారు. అయితే.. వాటిపై.. చర్చకాడు.. మంత్రి స్టేట్‌మెంట్ ఇచ్చారని.. ప్రభుత్వ పక్షం అంటోంది.మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. గందరగోళంగా మారుతున్నాయని సామాన్యులు రొద పెడుతున్నారు..