Begin typing your search above and press return to search.

ఏపీలో ఏప్రిల్ ఒక‌టి విడుద‌ల‌.. స‌రికొత్త సినిమా చూపిస్తున్న స‌ర్కారు

By:  Tupaki Desk   |   29 March 2022 9:32 AM GMT
ఏపీలో ఏప్రిల్ ఒక‌టి విడుద‌ల‌.. స‌రికొత్త సినిమా చూపిస్తున్న స‌ర్కారు
X
ఏపీలో ప్ర‌జ‌ల‌కు స‌రికొత్త సినిమా చూపించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు.. సినిమా హాళ్ల‌కు వెళ్లి.. ఎప్పుడు ఏ ఆట‌కు కావాలంటే.. ఆ ఆట‌కు టికెట్లు కొనుగోలు చేసే ప‌రిస్థితి ఉండేది. అయితే.. ప్ర‌భుత్వం ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకువ‌చ్చింది. దీని ప్ర‌కారం.. ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌లోనే సినిమా టిక్కెట్లు విక్ర‌యించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆన్‌లైన్ టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్లు పూర్తి చేసిన ప్రభుత్వం దీనికి సంబంధించి తాజాగా మీడియాకు కొంత స‌మాచారం లీక్ చేసింది.

అయితే.. ప్రైవేట్ సంస్థలకంటే తక్కువ ధ‌ర‌ల‌కే టికెట్లు విక్ర‌యించేలా.. ప్రభుత్వమే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి టెండర్లలో జస్ట్ టిక్కెట్ సంస్థ L -1 గా నిలిచినట్లు సమాచారం. మ‌రి ఈ సంస్థ‌కు ఇస్తారా? లేక‌.. ప్ర‌భుత్వ‌మే ఓన్‌గా నిర్వ‌హిస్తుందా? అనేది వేచి చూడాలి. మ‌రోవైపు.. అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం లేకుండా ప్రభుత్వమే నిర్వహణ చేయాల‌ని.. ప్రాధమిక నిర్వ‌హించార‌ని.. అధికారులు చెబుతున్నారు.

అయితే.. ఏది ఎలా ఉన్నా..దీనిపై మ‌రో రెండురోజుల్లో క్లారిటీ రానుంద‌ని అంటున్నారు. నిజానికి ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంత వాసుల వ‌ర‌కు అయితే.. ఈ విధానానికి ఓకే. కానీ, గ్రామీణ ప్రాంతాల ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఒక‌వేళ ఫైబ‌ర్ నెట్‌.. వంటి సౌక‌ర్యాన్ని గ్రామీణుల‌కు క‌ల్పిస్తున్నామ‌ని.. ప్ర‌భుత్వం చెబుతున్నా.. నిర‌క్ష్య రాస్యులైన గ్రామీణులు.. మ‌హిళ‌లు.. సినిమాకు దూరం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అంతేకాదు... ప్ర‌స్తుతం మ‌నీ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్ విధానం వ‌చ్చిన త‌ర్వాత‌.. వెయ్యికి రూ.20 చొప్పున క‌మీష‌న్ తీసుకుని ట్రాన్స‌ఫ‌ర్ చేసే వ్యాపారాలు పెరిగిపోయాయి. ఇలానే రేపు.. టికెట్ల బుకింగ్ కోసం..ప్రైవేటు వ్యాపారులు.. ఇలాంటి గ్రామీణుల‌ను దోచుకోరా.. అప్పుడు.. ప్ర‌భుత్వ ల‌క్ష్యం ఏమైన‌ట్టు అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం మాత్రం త‌న దారిన త‌నే వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.